కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhavanisagar Dam: 69వ వసంతంలోకి భవానీసాగర్‌ డ్యాం

ABN, First Publish Date - 2023-08-20T08:34:04+05:30

రాష్ట్రంలో రెండో పెద్ద జలాశయంగా ఉన్న భవానీసాగర్‌ డ్యాం(Bhavanisagar Dam) శనివారం 69వ వసంతంలోకి అడుగిడింది. దక్షిణాదిన అతిపెద్ద మట్టి

Bhavanisagar Dam: 69వ వసంతంలోకి భవానీసాగర్‌ డ్యాం

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో రెండో పెద్ద జలాశయంగా ఉన్న భవానీసాగర్‌ డ్యాం(Bhavanisagar Dam) శనివారం 69వ వసంతంలోకి అడుగిడింది. దక్షిణాదిన అతిపెద్ద మట్టి డ్యాం కూడా ఇదే. ఈరోడ్‌ జిల్లాలో ఉన్న ఈ డ్యాం పూర్తి సామర్థ్యం 105 అడుగులు కాగా, సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. భవానీ నది - మాయారు కలిసే ప్రాంతంలో రూ.10.5 కోట్లతో 1948లో డ్యాం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న భారీ యంత్రాలతో ఏడేళ్లలో డ్యాం నిర్మాణం పూర్తి చేశారు. ఈ డ్యాంను 1955లో అప్పటి ముఖ్యమంత్రి కామరాజర్‌(Chief Minister Kamarajar) ప్రారంభించారు. డ్యాంలోని 21 షట్టర్ల ద్వారా వెలువడుతున్న నీటి ద్వారా 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఇప్పటివరకు 22 సార్లు పూర్తి సామర్థ్యానికి చేరిన ఈ డ్యాం, 68 వసంతాలు పూర్తి చేసుకుని గంభీరంగా దర్శనమిస్తోంది.

Updated Date - 2023-08-20T08:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising