Big Mistake: షాపింగ్ మాల్స్‌లో ఎస్కలేటర్‌పై పిల్లల్ని తీసుకెళ్తున్నారా..? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి..!
ABN, First Publish Date - 2023-07-07T13:33:38+05:30
ఓ వ్యక్తి తన కొడుకును ఎస్కెలేటర్ పైన తీసుకెళ్తున్నప్పుడు ఎవ్వరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. దీనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
నగరాల్లోని రైల్వేస్టేషన్లలోనూ, షాపింగ్ మాల్స్ లోనూ ఎస్కలేటర్లు తప్పనిసరిగా ఉంటాయి. ఈ ఎస్కలేటర్లకు సంబంధించి చాలా వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని షాకింగ్ గా ఉంటాయి. ఓ వ్యక్తి తన కొడుకును ఎస్కెలేటర్ పైన తీసుకెళ్తున్నప్పుడు ఎవ్వరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. దీనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఎస్కెలేటర్ పై పిల్లల్ని తీసుకెళ్ళేవారు జాగ్రత్తగా ఉండండి' అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ సకంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
షాపింగ్ మాల్స్(shoping malls)కు వెళ్ళినప్పుడు పిల్లలను ఎత్తుకుని షాపింగ్ చేయడం కాస్త కష్టంతో కూడిన వ్యవహారం. దీంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను షాపింగ్ ట్రాలీలలో కూర్చోబెట్టుకుని షాపింగ్ చేస్తుంటారు(kids in shoping trally's). ఓ తండ్రి తన చిన్నారిని షాపింగ్ కు తీసుకెళ్లాడు. పిల్లాడిని చిన్న ప్లాస్టిక్ బుట్టలో పెట్టి ఎస్కలేటర్ వద్దకు తీసుకొచ్చాడు. వీడియోలో అతను మొదట తన బిడ్డను ప్లాస్టిక్ బుట్టలో(father put kid in basket) కూర్చోబెట్టాడు. ఆ తరువాత ఆ బుట్టను ఎస్కలేటర్(basket placed on escalator)పైన ఉంచాడు. అతను వెంటనే ఎస్కలేటర్ ఎక్కి ఆ బుట్టను పట్టుకోవాలన్నది అతని ప్లాన్. కానీ అతను ఎస్కలేటర్ పైకి వెళ్లేలోపు పిల్లాడు ఉన్న బుట్ట ముందుకు కదిలిపోయింది. అది ఎస్కలేటర్ మెట్ల మీద నుండి కిందకు దొర్లింది. దీంతో బుట్ట, బుట్టలో ఉన్న పిల్లాడు కూడా మెట్లమీద నుండి దొర్లుకుంటూ వెళ్లి కింద పడ్డారు(baby fall down from escalator).పిల్లాడి తండ్రి కంగారుగా ఎస్కలేటర్ మెట్లు దిగి వెళ్లడం, పిల్లాడిని చేతుల్లోకి తీసుకోవడం వీడియోలో చూడచ్చు. ఈ సంఘటన మొత్తం షాపింగ్ మాల్ లో ఏర్పాటుచేసిన సీసీకెమెరా(CC Camera)లో రికార్డు అవ్వడంతో బయటకు వచ్చింది.
Drinking Water: రోజూ పరగడపున నీళ్లు తాగితే మంచిదేనంటూ.. అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. ఆయుర్వేదంలో ఏముందంటే..!
ఈ వీడియోను People with 1 IQ అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'పిల్లలతో ఆడుకోవడానికి అది సరైన స్థలమా?' అని మండిపడుతున్నారు. 'అతనేమైనా తాగాడా? ఎందుకలా చేశాడు' అని అంటున్నారు. 'ఆ పిల్లాడు బానే ఉన్నాడా లేదా?' అని పిల్లాడి క్షేమం గురించి ఆందోళన చెందుతున్నారు. 'ఫాదర్ ఆఫ్ ద ఇయర్' అని వ్యంగంగా ఓ బిరుదు కట్టబెట్టారు.
Wife: భార్య వాట్సప్ చాటింగ్‌ను ఫొటోలు తీసుకుని మరీ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త.. గుడికి వెళ్లి వస్తానని చెప్పి..!
Updated Date - 2023-07-07T13:33:38+05:30 IST