ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Blood vs Snake Venom Video: రక్తాన్ని ఓ గ్లాసులో పోసి.. ఒక్క చుక్క పాము విషాన్ని అందులో వేస్తే క్షణాల్లోనే షాకింగ్ సీన్..!

ABN, First Publish Date - 2023-09-27T15:52:51+05:30

ఒకే ఒక్క చుక్క పాము విషం గ్లాసులోని రక్తంలో కలపగానే సెకెన్లలోపే ఏం జరిగిందో చూస్తే వణికిపోతారు..

పాములు చాలా జుగుప్స కలిగించే ప్రాణులు. విషపూరితమైనవి, విషపూరితం కానివి అనే తేడా లేకుండా ఇవి మనుషులను భయపెడతాయి. ఇక విషపూరితమైన పాముల పేరు చెబితే వణికిపోయేవారు ఎక్కువ. పాము విషం చాలా ప్రమాదకమైనది. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయోగశాలలో కొందరు పామునుండి విషం సేకరించి ఒక చుక్క విషాన్ని గ్లాసు రక్తంలో వేశారు. ఆ తరువాత జరిగిన సంఘటన చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ వీడియో చూసినవారు షాకవుతున్నారు. అందుకే కదా పాములంటే ఇంతగా భయపడతారు అని చెబుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఎవరికైనా పాము కరిస్తే(snake bite) పాము కాటు వేసిన చోట గట్టిగా కట్టేస్తుంటారు. పాము విషం రక్తం ద్వారా శరీరమంతటా వ్యాపిస్తుందని, దాని వల్ల చనిపోతారని అంటారు. ఇది నిజమే అయినా పాము విషం కారణంగా మనుషులు ఎందుకు చనిపోతారనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఆ డౌట్ కు సమాధానమే ఈ వీడియో. వీడియోలో కొందరు నాగుపామును(cobra) చేత్తో పట్టుకుని దాని కోరల నుండి విషం(venom) సేకరించడం చూడచ్చు. ఇలా సేకరించిన విషాన్ని ఒక సిరంజిలోకి తీసుకుంటారు. ఆ తరువాత ఒక గాజు గ్లాజులో సగం వరకు రక్తాన్ని(blood) తీసుకున్నారు. ఒకే ఒక చుక్క పాము విషాన్ని సిరంజి నుండి గ్లాసులోని రక్తంలోకి వేసి కొన్ని సెకెన్లు ఆ గ్లాసును అటూ ఇటూ కదిలించారు. ఆ తరువాత ఆ గ్లాసులో రక్తాన్ని ఒక ట్రేలోకి వేయగా ఆ రక్తం ద్రవరూపంలో లేదు. రక్తం గడ్డలా మారిపోయింది. అది చూడటానికి శరీరంలోని ఒక చిన్న కండరంలా కనిపిస్తోంది. విషపూరితమైన పాము కాటు వేసినప్పుడు శరీరంలో జరిగేది కూడా ఇదేనని అంటున్నారు. పాము విషం శరీరంలోని రక్తాన్ని గడ్డ కట్టేలా చేస్తుంది(snake venom clot the blood). ఈ కారణంగా శరీరంలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఇది మాత్రమే కాకుండా గుండె, ఊపిరితిత్తులు వంటి చాలా ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. దీని కారణంగా మరణం సంభవిస్తుంది.

Weight Loss Tips: 30 రోజుల్లో బరువు తగ్గడం ఎలా..? అయిదంటే అయిదే టిప్స్.. నెల రోజుల తర్వాత చెక్ చేసుకుంటే..!



భయం పుట్టిస్తున్న ఈ వీడియోను Learning Something అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'పాము విషం రక్తంతో కలిస్తే జరిగేది ఇదే' అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'పాము కాటు వేస్తే ఇక ప్రాణాల మీద ఆశ వదులుకోవాలని చాలా మంది అనడానికి కారణం ఇదే' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇది చాలా భయంకరంగా ఉంది' అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. 'పాము కాటుకు విరుగుడుగా మందులు తయారుచేశారు. వాటి ద్వారా తిరిగి మళ్ళీ రక్తం ద్రవస్థితిలోకి మారుతుంది. అయితే చికిత్స చాలా త్వరగా అందాలి' అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

Fingernails: గోర్ల మాటున దాగి ఉండే ఆరోగ్య రహస్యాలు.. గోర్లు వాటంతట అవే విరిగిపోతూ ఉంటే అర్థమేంటంటే..!


Updated Date - 2023-09-27T15:52:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising