Boney kapoor Emotional: చివరి ఫొటో... నీ జ్ఞాపకాలు పదిలం

ABN, First Publish Date - 2023-02-24T00:11:30+05:30

అందాల నటి, అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయి అప్పుడే ఐదేళ్లు గడిచిపోయింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించారు.

Boney kapoor Emotional:  చివరి ఫొటో... నీ జ్ఞాపకాలు పదిలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందాల నటి, అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) తిరిగిరాని లోకానికి వెళ్లిపోయి అప్పుడే ఐదేళ్లు గడిచిపోయింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించారు. ఆమె అందరినీ వదిలి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఆమె కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు (Fans emotional) కూడా ఇప్పటికి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. శ్రీదేవి నటించిన ప్రతి పాత్ర ఓ ఆణిముత్యం అంటూ నెటిజన్లు ఇప్పటికీ కొనియాడుతున్నారు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఆమెకు మరణం లేదని కామెంట్లు చేస్తున్నారు. గురువారం శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఆమె చివరి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. (Sri devi last photo Viral)

కుటుంబ సభ్యుల ఇంట్లో జరిగిన వేడుకలో శ్రీదేవితో కలిసి తీయించుకున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి ‘చివరి ఫొటో..’ అని పేర్కొన్నారు బోనీ కపూర్‌. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘ఇన్‌స్టా స్టోరీలో మరో ఫొటో షేర్‌ చేసి ‘‘నువ్వు మమ్మల్ని వదిలి ఐదు ఏళ్లు అవుతోంది. నీ ప్రేమ, నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి’’ అని పేర్కొన్నారు. జాన్వీ, ఖుషీ కపూర్‌ కూడా తరచూ తమ తల్లిని తలచుకొని భావోద్వేగానికి లోనవుతుంటారు. (Boney kapoor Emotional on Sri devi death)

తాజాగా శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ‘‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌( The Life of a legend) ’’ పేరుతో ప్రముఖ రచయిత ధీరజ్‌కుమార్‌ ఈ పుస్తకాన్ని రచిస్తున్నారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే శ్రీదేవి వర్థంతి సందర్భంగా ఈ నెల 24న ‘‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రాన్ని చైనాలో విడుదల చెయ్యనున్నారు. సుమారుగా 6000 ధియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

Updated Date - 2023-02-24T00:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising