Viral Video: హ్యాట్సాఫ్.. ఈమె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ చిన్నోడిని కాపాడింది..!

ABN, First Publish Date - 2023-05-09T12:29:12+05:30

ఇటీవల వీధి కుక్కలు (Street Dogs) విరుచుకుపడుతున్న ఘటనలు తరచూ వార్తలో నిలుస్తున్నాయి.

Viral Video: హ్యాట్సాఫ్.. ఈమె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ చిన్నోడిని కాపాడింది..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: ఇటీవల వీధి కుక్కలు (Street Dogs) విరుచుకుపడుతున్న ఘటనలు తరచూ వార్తలో నిలుస్తున్నాయి. మొన్న హైదరాబాద్‌లో (Hyderabad) ఓ బాలుడిని వీధి కుక్కలు అటవీ జంతువుల కంటే దారుణంగా వేటాడి మరి చంపేసిన ఘటన అందరినీ కలిచి వేసింది. ఆ తర్వాత కూడా ఇలాంటి పలు ఘటనలు జరిగాయి. ఇదే కోవకు చెందిన ఓ ఘటన తాలూకు పాత వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. వీడియోలో ఓ మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి, శునకంతో పోరాడి మరీ ఓ చిన్నోడి ప్రాణాలు కాపాడడం మనం వీడియోలో చూడొచ్చు.

వివరాల్లోకి వెళ్తే.. 2018లో దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ఉత్తమ్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ఘటన తాలూకు దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ శునకం ఇంటిముందు కూర్చున్న కొంతమంది పిల్లలపై ఎటాక్ చేయబోయింది. దాంతో వారు ఇంట్లోకి పరిగెత్తారు. కానీ, ఓ బాలుడు దానికి చిక్కాడు. అంతే.. అతడిపై ఆ డాగ్ విరుచుకుపడింది. అంతలోనే.. అటువైపుగా వచ్చిన ఓ మహిళ బాలుడిని కుక్క నుంచి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, అది ఎంతకు బాలుడ్ని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత మరి కొంతమంది వచ్చి శునకాన్ని తరిమికొట్టారు. బాలుడిని విడిచిపెట్టిన ఆ కుక్క మరో వ్యక్తి వెంటబడటం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.61లక్షల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Viral News: పెళ్లిలో ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌కు 4ఏళ్ల తర్వాత పెళ్లికూతురి నుంచి మెసేజ్.. ఆ తర్వాత ఆమె అడిగిన విషయంతో అతడి ఫీజులు ఎగిరిపోయాయి..


Updated Date - 2023-05-09T12:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising