Shocking Video: బాబోయ్.. ఆ పెళ్లి చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.. కట్నంగా వధువు బరువుకు సమానమైన గోల్డ్.. నిజమేంటంటే..
ABN, First Publish Date - 2023-02-28T19:46:52+05:30
దుబాయ్‌లో (Dubai) అత్యంత విలాసవంతంగా జరిగిన ఓ వివాహ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ జంట దుబాయ్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకుంది.
దుబాయ్‌లో (Dubai) అత్యంత విలాసవంతంగా జరిగిన ఓ వివాహ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ జంట దుబాయ్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకుంది (Lavish wedding in Dubai). అయితే ఆ వివాహంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివాహ వేడుక సమయంలో వధువును ఓ పెద్ద త్రాసులో ఓ వైపు కూర్చోపెట్టి మరోవైపు ఆమె బరువుకు సమానమైన బంగారాన్ని వేశారు. వధువు 70 కిలోగ్రాముల బరువు ఉందని, ఆమె బరువుకు సమానమైన బంగారు ఇటుకలను (Gold Bricks as Dowry) తూచి వరుడికి కట్నంగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే కొంత మంది ఆ బంగారు బిస్కెట్లు నకిలీవని కొట్టి పారేస్తున్నారు. బాలీవుడ్ సినిమా జోధా అక్బర్‌లోని సీన్‌ను కాపీ చేశారని, ఆ బిస్కెట్లు నిజంగా బంగారం కావని అంటున్నారు. అయితే అందులో నిజమేంటనేది ఇంకా బయటకు రాలేదు. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.
Updated Date - 2023-02-28T21:19:48+05:30 IST