Viral Video: పెళ్లి వేడుకలో వరుడికి, అతిథులకు కళ్ల గంతలు కట్టిన వధువు.. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే కన్నీళ్లు రాకమానవు!
ABN, First Publish Date - 2023-10-01T13:35:23+05:30
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ మధురమైన ఘట్టం. అలాంటి వివాహ వేడుక ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచి పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ తన పెళ్లి రోజును ప్రత్యేకంగా మార్చుకునేందుకు ఓ మార్గాన్ని కనిపెట్టింది. పెళ్లికి హాజరైన వారందరి చేత కంటతడి పెట్టించింది.
వివాహం (Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ మధురమైన ఘట్టం. అలాంటి వివాహ వేడుక ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచి పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలను కూడా రూపొందిస్తారు. ఇంగ్లండ్ (England)కు చెందిన ఓ మహిళ తన పెళ్లి రోజును ప్రత్యేకంగా మార్చుకునేందుకు ఓ మార్గాన్ని కనిపెట్టింది. పెళ్లికి హాజరైన వారందరి చేత కంటతడి పెట్టించింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివాసం ఉంటున్న లూసీ ఎడ్వర్డ్స్ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్ ఒల్లీ కేవ్‌ను లండన్‌లో వివాహం చేసుకుంది.
ఆ వివాహ వేడుకకు హాజరైన వారందరూ తమ తమ కళ్లకు గంతలు (Blind folds) కట్టుకున్నారు. వరుడు (Groom) కూడా తన కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఆ వివాహ వేడుక జరిగినంత సేపూ అందరూ అలాగే ఉన్నారు. లూసీ అలా ప్లాన్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందుకంటే లూసీ అంధురాలు. ఆమె రెండు నెలల వయసులో జన్యుపరమైన సమస్య కారణంగా చూపు కోల్పోయింది. చూపు లేని లూసీని ఒల్లీ ఇష్టపడ్డాడు. ఇద్దరూ కొద్ది కాలం సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అతిథులను పిలిచారు. అయితే పెళ్లికి హాజరయ్యే వారందరూ కళ్లకు గంతలు కట్టుకోవాలని సూచించారు.
Viral Video: కంట తడి పెట్టిస్తున్న వీడియో.. చేతులు లేకపోయినా కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి..
వధువు లూసీ పెట్టిన నిబంధనకు అందరూ ఆనందంగా అంగీకరించారు. ``ఈ ఐడియా ఒల్లీకి చాలా నచ్చింది. ఒల్లీని కేవలం స్పర్శ ద్వారానే నేను ఎలా ఫీల్ అవుతున్నానో.. అదే అనుభూతిని వివాహ వేడుకలో మా నాన్న నా చేతిని తన చేతిలో పెట్టినప్పుడు ఒల్లీ కూడా ఫీల్ కావాలి. ఈ క్షణాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటా. నన్ను, నా లోపాన్ని అంగీకరించి వివాహం చేసుకుంటున్న ఒల్లీ లాంటి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిన``ని పేర్కొంటూ లూసీ తన వివాహ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.5 లక్షల మంది లైక్ చేశారు.
Updated Date - 2023-10-01T13:35:23+05:30 IST