ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride: వరుడి మెడలో దండ వేయకుండా.. సడన్‌గా గదిలోకి వెళ్లిపోయిన వధువు.. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన నిర్వాకంతో..!

ABN, First Publish Date - 2023-05-23T15:00:49+05:30

ఏ అమ్మాయైనా మంచి భర్త భాగస్వామిగా రావాలనే కోరుకుంటుంది. అలాగే అబ్బాయిలు కూడా అలానే కోరుకుంటారు. జీవితాంతం కలిసుండే భాగస్వామి కోసం

wedding day
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ అమ్మాయైనా మంచి భర్త భాగస్వామిగా రావాలనే కోరుకుంటుంది. అలాగే అబ్బాయిలు కూడా అలానే కోరుకుంటారు. జీవితాంతం కలిసుండే భాగస్వామి కోసం ఇలా ఆలోచించడం తప్పేం కాదు. అలాగే పెద్దలు కూడా సంబంధాలు చూసేటప్పుడు మంచి సంబంధాలనే వెతుకుతుంటారు. ఈడూ జోడూ బాగుండి.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని పెద్దలు కోరుకుంటారు. అందుకే సంబంధాలు కుదుర్చుకునేటప్పుడే ఒకటికి పది సార్లు పరిశీలించి కుదుర్చుకుంటారు.

అయితే ఈ మధ్య పెళ్లిపీటల దాకా వచ్చీ ఆగిపోయిన మ్యారేజ్‌లు చాలానే చూస్తున్నాం. ఆయా కారణాల చేత వధువులు పెళ్లి నిరాకరించిన సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. కాసేపట్లో మూడు ముళ్లు పడతాయన్న టైమ్‌కి పెళ్లి వద్దంటూ వధువు మొండికేసింది. చేసేదేమీలేక పెళ్లి రద్దు చేసుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

చౌబేపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. సాయంత్రం ఊరేగింపుగా ముందుగా బుక్‌ చేసుకున్న ఓ ఖరీదైన ఫంక్షన్​ హాల్​కు వరుడు, అతడి బంధువులు చేరుకున్నారు. కాసేపటికీ వధువు కూడా తన స్నేహితులతో కలిసి వేదికపైకి వచ్చింది. వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే సమయానికి వరుడి ఫ్రెండ్స్‌.. పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేశారు. అప్పటికే వారు మద్యం సేవించి ఉండటంతో స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. ఇక వరుడి మెడలో దండ వేస్తుండగా అతడు కూడా (groom drunken) మద్యం సేవించి ఉన్నట్లు వధువు గమనించింది. దీంతో అసహనానికి గురైన వధువు.. వెంటనే వేదికపై నుంచి దిగి ఫంక్షన్‌ హాల్‌లోని ఓ గదిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడ ఉన్న అతిథులంతా ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. పెళ్లికొచ్చిన కొందరు మహిళలు వధువు ఉన్న గదిలోకి వెళ్లి ఆరా తీయగా.. ఆ తాగుబోతును పెళ్లి చేసుకోనంటూ (Bride cancels marriage) తెగేసి చెప్పేసింది.

ఇక పెళ్లి పీటల దాకా వచ్చిన వివాహాన్ని (wedding day) రద్దు చేసుకోవద్దంటూ.. వివాహానికి ఒప్పుకోవాలంటూ కుటుంబ పెద్దలు.. బంధుమిత్రులు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. అతడిని పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అంది. ఈ క్రమంలో వరుడి సోదరుడు రంగంలోకి దిగి.. వధువును పెళ్లికి ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. దయ చేసి ఒప్పుకోవాలంటూ బతిమిలాడాడు. అయినా వధువు ఏ మాత్రం అంగీకరించలేదు. చివరికి పోలీసులతోనైనా కౌన్సెలింగ్​ ఇప్పించి పెళ్లికి ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వధువు తగ్గకపోగా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగింది. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దు చేసుకున్నాయి. పెళ్లి ఏర్పాట్లకు అయిన ఖర్చులు, కట్నకానుకలు తిరిగి ఇచ్చేందుకు రెండు కుటుంబాల మధ్య రాజీ కుదరింది. దీంతో పెళ్లికి వచ్చిన వారందరితో పాటు వరుడు, అతడి కుటుంబ సభ్యులు నిరాశగా వెనుదిరిగారు.

నిశ్చితార్థం తర్వాత వధూవరులిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారని కుటుంబసభ్యులు తెలిపారు. రెండు వారాల క్రితమే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో వరుడు మద్యం మత్తులో వధువును దుర్భాషలాడాడని చెప్పారు. ఆ సమయంలోనే పెళ్లి చేసుకునేందుకు యువతి నిరాకరించింది. ఇది కాస్త పెద్దల దృష్టికి వెళ్లడంతో వరుడు ఆ యువతికి క్షమాపణలు చెప్పడంతో ఆమె పెళ్లికి అంగీకరించింది. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి మండపంలోకే మందు తాగి వచ్చిన వరుడికి యువతి సరైన గుణపాఠం చెప్పిందని పెళ్లికి వచ్చిన బంధువులు అన్నారు.

Updated Date - 2023-05-23T15:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising