Marriage: పెళ్లయిన మర్నాడే అత్తారింట్లో ఓ నవ వధువు వింత నిర్వాకం.. పడుకునేముందు అందరికీ మంచినీళ్లు ఇచ్చి మరీ..!
ABN, First Publish Date - 2023-08-14T15:02:44+05:30
పాపం ఆ వ్యక్తికి ఎన్నో ప్రయత్నాల తర్వాత వివాహం జరిగింది. లేటు వయసులో జరిగిన వివాహం కావడంతో అతడు భార్యను అపురూపంగా చూసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని వధువును ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన రెండు గంటల తర్వాత ఆ నూతన వధువు కుటుంబ సభ్యులందరికీ మంచి నీళ్లు ఇచ్చింది.
పాపం ఆ వ్యక్తికి ఎన్నో ప్రయత్నాల తర్వాత వివాహం (Marriage) జరిగింది. లేటు వయసులో జరిగిన వివాహం కావడంతో అతడు భార్య (Wife)ను అపురూపంగా చూసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని వధువును (Bride) ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన రెండు గంటల తర్వాత ఆ నూతన వధువు కుటుంబ సభ్యులందరికీ మంచి నీళ్లు ఇచ్చింది. అందరూ ఆమె ఇచ్చిన మంచినీళ్లు తాగి నిద్రపోయారు. తర్వాతి రోజు మధ్యాహ్నానికి గాని వారు లేవలేకపోయారు. లేచాక తమ పరిస్థితి చూసుకుని షాకయ్యారు (Crime News).
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన సంతోష్ అనే వ్యక్తికి 38 ఏళ్లు వచ్చినా పెళ్లి కుదరడం లేదు. వయసు పెరిగిపోతుండడంతో మధ్యవర్తి ద్వారా ప్రియాంక అనే అమ్మాయితో సంతోష్ పెళ్లి కుదుర్చుకున్నాడు. ప్రియాంకది పేద కుటుంబంతో కావడంతో ఆమె కుటుంబానికి రూ.4 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. పెళ్లి ముహూర్తం రోజున సంతోష్‌కు, ప్రియాంకకు ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి ఖర్చులు మొత్తం సంతోష్ కుటుంబమే పెట్టుకుంది. పెళ్లి తర్వాత ప్రియాంకను తమతో పాటు తీసుకెళ్లిపోయారు.
Viral Video: రైతే కదా అని చులకనగా చూడకండి.. పొలంలో ఈ సెట్టింగ్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్
పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజే అత్తింట్లో ప్రియాంక నటన మొదలుపెట్టింది. అత్తింటి వారందరికీ సేవలు చేసింది. రాత్రి 10 గంటల సమయంలో అందరికీ స్వయంగా ఆహారం, మంచినీళ్లు అందించింది. వారు ఆహారం తిని నిద్రపోయిన తర్వాత భర్తకు కూడా అలాగే ఇచ్చింది. తర్వాతి రోజు మధ్యాహ్నం అందరూ నిద్రలేచే సరికి ప్రియాంక కనిపించలేదు. ఇంట్లో ఉన్న నగదు, నగలు కూడా మాయమయ్యాయి. పోయిన డబ్బు, నగల విలువ దాదాపు రూ.8 లక్షలు ఉంటుందని అంచనా. సంతోష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Updated Date - 2023-08-14T15:02:44+05:30 IST