Viral Video: అయ్యో.. ఆ వరుడు అంటే వధువుకు ఇష్టం లేదా?.. పెళ్లి వేదిక మీద ఆమె ప్రవర్తన చూస్తే..
ABN, First Publish Date - 2023-07-09T16:07:42+05:30
భారతీయ సాంప్రదాయ వివాహా వేడుకల్లో అన్ని రకాల భావోద్వేగాలూ ఉంటాయి. బాలీవుడ్ సినిమా తరహాలో అన్ని రకాల మసాలాలు, డ్రామా, ఎమోషన్లు, సంతోషాలు పెళ్లి వేడుకల్లో కనిపిస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పెళ్లి జరిగే ఫన్నీ సీన్లు, ఆసక్తికర ఘటనలు వైరల్ అవుతున్నాయి.
భారతీయ సాంప్రదాయ వివాహా వేడుకల్లో అన్ని రకాల భావోద్వేగాలూ ఉంటాయి. బాలీవుడ్ సినిమా తరహాలో అన్ని రకాల మసాలాలు, డ్రామా, ఎమోషన్లు, సంతోషాలు పెళ్లి వేడుకల్లో కనిపిస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పెళ్లి జరిగే ఫన్నీ సీన్లు, ఆసక్తికర ఘటనలు వైరల్ అవుతున్నాయి (Wedding Videos). సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ పెళ్లి సీన్ చాలా మందికి ఓ క్వశ్చన్ మార్క్‌గా మారింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధూవరులు పెళ్లి వేదికపై వరమాల కార్యక్రమం కోసం నిలబడ్డారు. వధువు (Bride)కు స్వీట్ తినిపించేందుకు వరుడు (Groom) ప్రయత్నించాడు. అయితే వధువు మాత్రం స్వీట్ తినేందుకు ఇష్టపడలేదు. ఏ ఎమోషనూ లేకుండా అలా నిల్చుని ఉండిపోయింది (Bride refuses to eat sweets from Groom). దీంతో కొద్ది సేపు ఎదురు చూసిన వరుడు ఆ స్వీట్‌ను ప్లేట్‌లో పడేశాడు. ఆ తర్వాత వరుడు సోఫాలో కూర్చోగా వధువు అతడి పక్కన కూర్చోవడానికి ఇష్టపడలేదు. వధువు తరఫు వారు వచ్చి ఏదో చెప్పి ఆమెను వరుడి పక్కన కూర్చోపెట్టారు.
Shocking: భర్త లేనపుడు ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో వారి గతి ఏమైందంటే..
ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``వధువు తీరు చూస్తుంటే ఆ పెళ్లంటే ఇష్టం లేనట్టు అనిపిస్తోంది``, ``ఆ వరుడికి గవర్నమెంట్ జాబ్ ఉందేమో``, ``కాకి ముక్కుకు దొండపండు`` అంటూ వరుడి రంగుపై సెటైర్లు విసురుతున్నారు. అలాగే మరికొందరు వరుడు ఎంతో హుందాగా ప్రవర్తించాడని ప్రశంసిస్తున్నారు.
Updated Date - 2023-07-09T16:07:42+05:30 IST