ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride Video: ఇలాంటి సీన్‌‌ను ఏ పెళ్లిలోనూ చూసి ఉండరు.. ఏడుస్తూ ఉన్న వధువును ఇలా ఎందుకు ఎత్తుకుని వస్తున్నారో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-04-26T14:38:06+05:30

పెళ్ళిళ్లలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఈ పెళ్ళిలో మాత్రం విచిత్రంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు(Marriage videos) సంబంధించి ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్ళికొడుకు(groom), పెళ్లికూతురు(bride) ప్రవర్తన, పెళ్ళికి వచ్చిన అతిధుల(Marriage guests) ప్రవర్తన, పెళ్లిలో జరిగే సరదా సంఘటనలు(funny incidents), సీరియస్ విషయాలు(serious matters) ఇలా ఒకటేమిటి అన్నీ నెట్టింట్లో ఉంటాయి. ఓ అమ్మాయికి మంచి వరుడిని చూసి ఆమె తల్లిదండ్రులు(bride parents) పెళ్లి చేశారు. పెళ్ళితరువాత అమ్మాయిని అత్తారింటికి పంపుతున్నప్పుడు ఎవరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. చివరికి ఆ అమ్మాయిని అక్కడినుండి ఎత్తుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పెళ్ళి అంతా ఒకెత్తు అయితే అప్పగింతల కార్యక్రమం(send off ceremony) మరొక ఎత్తు. అప్పటి వరకు ఎంతో సందడి చేస్తూ, హడావిడిగా తిరిగిన అందరి మనసులు బరువెక్కిపోతాయి. ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురిని మరొక కుటుంబంలోకి దూరంగా పంపించేస్తున్నందుకు కన్నీళ్లు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. అయితే ఓ పెళ్ళిలో మాత్రం విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్ళి తరువాత వధువును వరుడితో అత్తారింటికి సాగనంపుతోంటే వధువు ఓ.. అని ఏడుపెత్తుకుంది. ఆమె ఏడుపు చూసి 'మా అమ్మాయికి మేమంటే ఎంత ప్రేమో.. మమ్మల్ని వదిలి వెళ్లడానికి ఎంత బాధపడుతోందో..' అని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. తమకు తోచిన విధంగా ఆమెను సముదాయించారు. కానీ వధువు మాత్రం తన ఏడుపు ఆపలేదు. మొదట్లో అదంతా తమ మీద ప్రేమ అనుకున్న ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఆ తరువాత అది చిరాకుగా మారింది. ఏడుపు ఆపమని ఎంత ఆపమన్నా వధువు ఆపకపోయే సరికి వాళ్ళకు విసుగొచ్చింది. 'అత్తారింటికి వెళ్ళాలి, పదా కారెక్కుదువు' అని చెబితే ఆమె వినలేదు. ఒకటే పెడబొబ్బలు పెట్టి ఏడూస్తూనే ఉంది. దీంతో వధువు కుటుంబ సభ్యులు, బంధువులు 'మాటలతో చెబితే వినేలాగ లేదు' అనుకున్నారేమో.. ఆమె కాళ్ళు చేతులూ పట్టుకుని కారు దగ్గరకు మోసుకెళ్ళి కారులో కుక్కేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. bridal_lehenga-designn అనే ఇన్స్ట్రాగ్రామ్ పేజీ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. 'అయ్యో పాపం ఆమెకు ఎంత కష్టమొచ్చిందో..' అని అంటున్నారు.

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవాళ్లంతా తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.. అందరూ కామన్‌గా చేసే ఈ మిస్టేక్ వల్లే..!


Updated Date - 2023-04-26T14:38:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising