Marriage: అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. బంధువులందరి ముందే అసలు నిజం చెప్పి..!
ABN, First Publish Date - 2023-12-01T15:40:47+05:30
వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఏ చిన్న ఘటన అయినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా, ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమానికి...
వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఏ చిన్న ఘటన అయినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా, ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. అతిథులంతా వివాహ తంతును చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కాసేపట్లో పెళ్లి పూర్తవుతుందనగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రాజ్‌వర్మకు ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం (marriage) నిశ్చయమైంది. ఇటీవల ఓ రోజు వారి వివాహ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇరువైపు కుటుంబాల బంధువులంతా వధువు గ్రామానికి చేరుకున్నారు. కొన్ని గంటల్లో వివాహ తంతు ముగుస్తుందనగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. వధువు కుటుంబ సభ్యులకు ఓ మహిళ ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘నా భర్త నాకు తెలీకుండా.. రెండో పెళ్లి చేసుంటున్నాడు’’.. అని రాజ్‌వర్మ మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో వధువుతో పాటూ తల్లిదండ్రులు, వారి బంధువులంతా షాక్ అయ్యారు.
విషయం తెలుసుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసిన రాజ్‌వర్మ, అతడి మేనమామ, మరికొంత మంది బంధువలను.. వధువు కుటుంబ సభ్యులు బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, రెండు కుటుంబాల వారితో మాట్లాడారు. తమకు నష్టపరిహారం చెల్లించేవరకూ వరుడిని వదిలే ప్రసక్తే లేదని వధువు కుటుంబ సభ్యులు భీష్మించుకున్నారు. వారి డిమాండ్లకు వరుడు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చాడు.. లోపలికి వెళ్లగానే భార్య చేసిన పనికి ఖంగుతిన్నాడు..
Updated Date - 2023-12-01T15:40:50+05:30 IST