British space scientist Maggie Aderin Pocock: ఆమె అంతరిక్ష శాస్త్రవేత్త.. విశేష కృషికి మెచ్చి ఎలా సత్కరించారో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-03-08T09:36:15+05:30
British space scientist Maggie Aderin Pocock: బ్రిటీష్ అంతరిక్ష శాస్త్రవేత్త మ్యాగీ అడెరిన్ పోకాక్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా ఆమెను ప్రత్యేకమైన బార్బీ బొమ్మతో సత్కరించారు.
British space scientist Maggie Aderin Pocock: బ్రిటీష్ అంతరిక్ష శాస్త్రవేత్త మ్యాగీ అడెరిన్ పోకాక్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా ఆమెను ప్రత్యేకమైన బార్బీ బొమ్మతో సత్కరించారు. ఈ 54 ఏళ్ల మాజీ బ్రిటిష్ సైన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్(President of the British Science Association), బాలికలను సైన్స్ కెరీర్ దిశగా ప్రోత్సహించడంలో రోల్ మోడల్‌గా పేరుపొందారు.
"మీరు అందనంత ఎత్తుకు ఎదగాలని భావిస్తున్నప్పుడు ఏదైనా సాధ్యమేనని నా బొమ్మ అమ్మాయిలకు గుర్తు చేస్తుందని నేను ఆశిస్తున్నాను" అని ఆమె మీడియా ముందు పేర్కొన్నారు. డాక్టర్ అడెరిన్-పోకాక్ 2020లో ఫిజిక్స్ న్యూస్ అవార్డ్స్(Physics News Awards)లో స్వర్ణం గెలుచుకున్న మొదటి నల్లజాతి మహిళ(black woman). ఆమె అంతరిక్షం, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన టీవీ ప్రోగ్రామ్ ‘ది స్కై ఎట్ నైట్’కి సహ-ప్రెజెంటర్ కూడా. బొమ్మల కంపెనీ మాట్టెల్ తయారుచేసిన ఈ బొమ్మ నక్షత్రాలతో రూపొందించిన దుస్తులను ధరించి కనిపిస్తోంది.
ఈ బొమ్మ టెలిస్కోప్‌తో లింక్ అయి ఉంది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షాన్ని చూస్తున్నట్టు ఆ బొమ్మ కనిపిస్తుంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(James Webb Space Telescope), అనేది వివిధ అంతరిక్ష సంస్థలు, శాస్త్రవేత్తల మధ్య జాయింట్ వెంచర్, ఇది డిసెంబర్ 2021లో ప్రారంభమైన ఇన్‌ఫ్రారెడ్ స్పేస్ అబ్జర్వేటరీ. ఈ టెలిస్కోప్ ద్వారా బిగ్ బ్యాంగ్(big bang) తర్వాత 200 మిలియన్ సంవత్సరాల అనంతరం విశ్వం ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు చూడవచ్చు.
ఈ టెలిస్కోప్‌పై పనిచేసిన శాస్త్రవేత్తలలో పోకాక్ ఒకరు. అంతరిక్ష పరిశోధనలకు(space exploration) పేరుగాంచిన లీసెస్టర్ యూనివర్సిటీకి ఆమె నూతన ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "యువతలో అంతరిక్షయానం(space flight) చేయాలనే ఆకాంక్ష ఉంటుంది. అంతరిక్ష శాస్త్రం ఎంత అద్భుతంగా ఉంటుందో అమ్మాయిలకు చూపించడానికి ప్రయత్నించాను. నేను తరువాతి తరం శాస్త్రవేత్తలను, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిని అందించాను.
సైన్స్ ద్వారా ప్రపంచాన్ని అక్షరాలా మార్చగలరని అన్నారు. ఇందుకు బార్బీ బొమ్మ(barbie doll)ల విస్తరణ శ్రేణి "స్మాష్ స్టీరియోటైప్‌లకు" సహాయపడగలదని ఆశిస్తున్నానన్నారు. తాను సాధించిన విజయాలను గుర్తు చేసేలా ఉన్న ఈ బొమ్మను స్వీకరించడం చాలా గౌరవంగా ఉంది. ఈ వార్త విన్నప్పుడు నా కుమార్తె, నేను గదిలో నృత్యం(dance) చేశామని మ్యాగీ అడెరిన్ పోకాక్ తెలిపారు.
Updated Date - 2023-03-08T13:10:40+05:30 IST