Viral Video: ఏంది సామీ ఇది.. గొడుగు పట్టుకుని బస్సు నడుపుతున్న డ్రైవర్.. మహారాష్ట్ర బస్సుల దుస్థితిపై నెటిజన్ల సెటైర్లు!
ABN, First Publish Date - 2023-08-26T15:50:09+05:30
ప్రభుత్వ ఆధీనంలో నడిచే స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పుడో పురాతన కాలం నాటి బస్సులను ఇప్పటికీ తిప్పుతుంటారు. వాటిని నడపలేక డ్రైవర్లు అష్టకష్టాలు పడుతుంటారు. ఏదో ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే దుస్థితి.
ప్రభుత్వ ఆధీనంలో నడిచే స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ (State Transport Bus) బస్సుల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పుడో పురాతన కాలం నాటి బస్సులను ఇప్పటికీ తిప్పుతుంటారు. వాటిని నడపలేక డ్రైవర్లు (Drivers) అష్టకష్టాలు పడుతుంటారు. ఏదో ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే దుస్థితి. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మహారాష్ట్ర ( Maharashtra) స్టేట్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన బస్సుకు సంబంధించిన వీడియో వైరల్ (Viral Video) అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో బస్సు వర్షం (Rain)లో ప్రయాణిస్తోంది. అయితే పాత బస్సు కావడం వల్ల ఆ బస్సు పై కప్పుపై పడిన నీరు చాలా చోట్ల లోపలికి వచ్చేస్తోంది (Bus Roof Leaked). డ్రైవర్ కూర్చున్న సీట్‌పై కూడా వర్షపు నీరు లీక్ అవుతోంది. ఆ వర్షం నీటిలో తడవకుండా ఉండేందుకు డ్రైవర్ గొడుగు (Umbrella) పట్టుకుని కూర్చున్నాడు. ఒక చేత్తో గొడుగు పట్టుకుని, మరో చేత్తో స్టీరింగ్ పట్టుకుని ప్రమాదకర పరిస్థితిలో బస్సు నడుపుతున్నాడు. ప్రయాణికుడు డ్రైవర్ పాట్లను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ బస్సు మహారాష్ట్రలోని అహేరి డిపోకు చెందిన బస్సు.
Metro Train: తప్పు బాబూ.. అలా చేయొద్దంటూ మెట్రో రైల్లో ఓ మహిళ చెప్పినా పట్టించుకోని కుర్రాడు.. ఇద్దరు యువతులతో..!
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇది అంబ్రిల్లా డ్రైవింగ్``, ``పాపం.. ఆ డ్రైవర్ ఆ బస్సును ఎలా నడుపుతున్నాడో``, ``ఇలా చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి``, ``గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులను, అక్కడి డిపోలను ప్రభుత్వం పట్టించుకోదు. వాటికి బడ్జెట్ కేటాయించరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-08-26T15:52:59+05:30 IST