ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

C. Kalyan: గిల్డ్‌ మాఫియా వల్లే పరిశ్రమ నాశనమవుతోంది!

ABN, First Publish Date - 2023-02-18T13:35:42+05:30

‘‘చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. దీనికి కారణం గిల్డ్‌ మాఫియా. గిల్డ్‌లో ఉన్నది 27 మంది సభ్యులు. దాని వల్ల పరిశ్రమకు వచ్చిన లాభం ఏమీ లేదు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్‌ సభ్యుల్లో వచ్చిన సమస్యలను సైతం నిర్మాతల మండలి పరిష్కరించింది’’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. దీనికి కారణం గిల్డ్‌ మాఫియా.( గిల్డ్‌లో ఉన్నది 27 మంది సభ్యులు. దాని వల్ల పరిశ్రమకు వచ్చిన లాభం ఏమీ లేదు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్‌ సభ్యుల్లో వచ్చిన సమస్యలను సైతం నిర్మాతల మండలి పరిష్కరించింది’’ అని నిర్మాత సి.కల్యాణ్‌ అన్నారు. (C kalyan Fire on producers guild) నిర్మాతల మండలి ఎన్నికలు, మండలికి, గిల్డ్‌కు మధ్య జరుగుతున్న వివాదాల నేపథ్యంలో సి.కల్యాణ్‌ శనివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. (producers council elections) ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘2019లో మేం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కానీ 30 సంవత్సరాల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చా. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ను నిర్మాతల మండలిలో కలిపేందుకు ప్రయత్నం చేశా. కానీ అధ్యక్ష పదవి మోజులో కొందరు నా ప్రయత్నాన్ని నీరుగార్చారు. దిల్‌ రాజు, సి.కళ్యాణ్‌ ప్యానెల్‌ వేరు వేరు కాదు. కొంతమంది నిర్మాతలు దిల్‌ రాజును తప్పుదారి పట్టించారు. దిల్‌ రాజుతో నన్ను పోలుస్తూ దుష్ప్రచారం చేశారు. నిర్మాతగా నేను 80 చిన్న సినిమాలు తీశాను. ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. సంస్థకు ఎవరు న్యాయం చేస్తారో వారిని గెలిపించుకోండి. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు’’ అని తెలిపారు. (C kalyan Fire on Guild)

ఆగస్ట్‌లో సినిమా షూటింగ్స్‌ నిలిపివేయడం వల్ల ఎలాంటి పరిశ్రమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని కల్యాణ్‌ విమర్శించారు. కె.ఎల్‌ దామోదర ప్రసాద్‌ నాలుగేళ్లపాటు కార్యదర్శిగా ఉన్నారనీ, ఆ సమయంలో ఆయన ఎవరికీ ఏ న్యాయం చేయలేదని ఎద్దేవ చేశారు. చిన్న నిర్మాతలకు నిర్మాతల మండలిలో అన్యాయం జరుగుతోంది. చిన్న సినిమాకు మనుగడ లేకపోతే పరిశ్రమ మూతపడుతుంది’’ అని సి.కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-18T13:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising