Cables: సముద్రం అడుగున కేబుల్స్
ABN, First Publish Date - 2023-05-30T12:22:15+05:30
ముంబై నుంచి సింగపూర్(Mumbai to Singapore)కు డేటా ట్రాన్స్‌మిషన్ కోసం కేబుల్ వేసే పనులు జరుగుతుండగా కేబుల్ లాగుతున్న ఓడ చెన్నైకి చే
- ముంబై నుంచి సింగపూర్ బయల్దేరిన ఓడ చెన్నై రాక
పెరంబూర్(చెన్నై): ముంబై నుంచి సింగపూర్(Mumbai to Singapore)కు డేటా ట్రాన్స్‌మిషన్ కోసం కేబుల్ వేసే పనులు జరుగుతుండగా కేబుల్ లాగుతున్న ఓడ చెన్నైకి చేరుకుంది. ఎన్‌టీడీ సంస్థ ముంబై నుంచి సింగపూర్‌కు సముద్రంలో ఇంటర్నెట్ సేవల అందించే పనులు చేపట్టింది. ఇందుకోసం ముంబై నుంచి సముద్రంలో కేబుల్ వేసే పనులు కొనసాగుతున్నాయి. కేబుల్ లాగుతున్న ఓడ ప్రస్తుతం చెన్నై శాంథోమ్ బీచ్‌కు చేరుకుంది. ముంబై నుంచి సముద్ర మార్గంగా ఎన్‌డీటీ కార్యాలయంతో భూమి అనుసంధానంగా చేసే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తదనంతరం మయన్మార్, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్ వరకు సుమారు 8,100 కి.మీ దూరం సముద్రం గుండా కేబుల్ ఏర్పాటు కానుంది. ఈ కేబుల్ ఏర్పాటు పూర్తయితే హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశముంది.
Updated Date - 2023-05-30T12:22:15+05:30 IST