ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cauliflower vs Cabbage: కాలీఫ్లవర్ మంచిదా..? క్యాబేజీ తినాలా..? ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..!

ABN, First Publish Date - 2023-12-07T11:32:44+05:30

చలికాలంలోక్యాబేజీ, కాలీఫ్లవర్ బాగా పండుతాయి. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్య లాభాలు ఇస్తుందంటే..!

ఆరోగ్యాన్ని చేకూర్చడంలో సీజనల్ కూరగాయలు ఎప్పుడూ ముందుంటాయి. చలికాలంలో విరివిగా పండే కూరగాయలలో క్యాబేజీ, కాలీఫ్లవర్ ముఖ్యమైనవి. ఎంతో మంది ఇష్టంగా తినే వీధి ఆహారాలైన గోబీ పకోడా, క్యాబేజీ పకోడా, గోబీ మంచూరియా, గోబీ ఫ్రైడ్ రైస్ మొదలైనవి వీటితోనే చేస్తారు. సూప్ లు, సలాడ్ లలో వినియోగిస్తారు. పోషకాల పరంగా, కేలరీల పరంగా, చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాల పరంగా రెండింటిలో ఏది బెస్టో తెలుసుకుంటే..

పోషకాలు..(Nutrients)

క్యాబేజీ, కాలీఫ్లవర్ రెండింటిలోనూ విటమిన్లు, ఫోలేట్ లు సమృద్దిగా ఉంటాయి. కాలీఫ్లవర్ లో విటమిన్-సి,కె,బి6 ఉంటాయి. అయితే క్యాబేజీలో విటమిన్-సి,కె మాత్రమే ఉంటాయి. ఈ రెండు కూరగాయల్లోనూ డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రెండూ జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి.

ఇది కూాడ చదవండి: మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టకూడని 7 ఆహార పదార్థాల లిస్ట్ ఇదీ..!


కేలరీలు..(Calories)

కేలరీలు ఎక్కువ తీసుకుంటే బరువు పెరుగుతారని బెంగ పడేవారికి ఈ రెండూ సూపర్ ఫుడ్స్. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యాబేజీ కంటే కాలీఫ్లవర్ లో కేలరీలు ఇంకా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇవి బాగా సహాయపడతాయి.

ఆరోగ్య ప్రయోజానాలు..(health benefits)

క్యాబేజీ, కాలీఫ్లవర్ లో యాంజీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. వీటిలో ఉండే సల్ఫోరాఫేన్ క్యాన్సర్ కణాల పెరుగుదల నిరోధిస్తుంది. ఈ రెండింటిని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

కాలీఫ్లవర్, క్యాబేజీ రెండూ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కాలీఫ్లవర్ లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. క్యాబేజీలోని పైబర్, యాంటీఆక్సిడెంట్ గుణాలు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. హృదయనాళాలలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

క్యాబేజీలోని ఆంథోసైనిన్ లు, కాలీఫ్లవర్ లోని సల్పోరాఫేన్ లు గొప్ప యాంటీఆక్సిడెంట్లు. శరీరానికి యాంటీఆక్సిడెంట్లు చాలా అవసరం. ఇవి శరీరంలో ఒత్తిడిని, అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘకాల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: పిల్లలకు 10 ఏళ్ల వయసొచ్చేలోపే తప్పక నేర్పాల్సిన 10 విషయాలు..!

(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పేర్కొన్న అంశాల ఆధారంగా ఇవ్వబడిన కథనం. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)

Updated Date - 2023-12-07T11:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising