Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!
ABN, First Publish Date - 2023-04-03T16:14:49+05:30
ఆధార్ కార్డు (Aadhaar Card) అన్నింటికీ ఆధారం అయింది. ఈ కార్డు లేకపోతే కొన్ని పనులు ముందుకే సాగవు. ప్రభుత్వం నుంచీ ఏదైనా లబ్దిపొందాలన్నా.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. రేషన్ కార్డు పొందాలన్నా.
ఆధార్ కార్డు (Aadhaar Card) అన్నింటికీ ఆధారం అయింది. ఈ కార్డు లేకపోతే కొన్ని పనులు ముందుకే సాగవు. ప్రభుత్వం నుంచీ ఏదైనా లబ్దిపొందాలన్నా.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. రేషన్ కార్డు పొందాలన్నా.. స్కూల్‌లో చేరాలన్నా.. స్కాలర్‌షిప్ పొందాలన్నా.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్ని ఉన్నాయో.. ఈ కార్డుతో ఎన్నో పనులు ముడిపడి ఉన్నాయి. మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా అడిగేది ఉందంటే అది ఆధార్ కార్డే. మనుషుల దయనందిన జీవితంలో ఆధార్‌కార్డు తప్పనిసరి అయింది. అంటే ఈ కార్డుకు అంత విశిష్టత ఉంది. అలాంటి ఈ ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ (Aadhaar Card New Rules) మనుషుల్నీ వేధిస్తోంది. తాజా మార్గదర్శకాల ప్రకారం కొన్ని ఆధారాలు సమర్పించాలని సూచించింది.
ఆధార్ కార్డు (Aadhaar Card) లో ఏవైనా పొరపాట్లు ఉంటే గతంలో సవరణలు చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇలాంటి లొసుగులను ఆధారం చేసుకుని కొందరు మోసాలకు తెగబడేవారు. ఇలాంటి అక్రమాలకు కళ్లెం వేసేందుకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం యూఐడీఏఐ (UIDAI) ను తీసుకొచ్చింది. ఆయా కేటగిరీల వారీగా సమర్పించే పత్రాల్లో మార్పులు చేస్తూ దరఖాస్తు విధానాన్ని మార్చింది. ఈ తాజా నిర్ణయంతో ప్రజలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
ఆధార్ కార్డును సవరణలు చేసుకునే వారి వయసుల ప్రకారం మూడు వర్గాలు విభజించింది. ఐదేళ్లలోపు పిల్లలను మొదటి కేటగిరీగా.. ఐదు నుంచి 18 ఏళ్ల లోపు వారిని రెండు కేటగిరీగా.. 18 ఏళ్లు పైబడిన వారిని మూడో కేటగిరీగా విభజించారు. ఇలా మూడు వర్గాలు విభజించి... వేర్వేరు దరఖాస్తులను రూపొందించారు.
ఇక ఆధార్ కార్డును పదేళ్లకోసారి అప్‌డేట్ చేసుకోవాలి. లోకల్‌గా ఎక్కడ ఉంటున్నారో దాన్ని నిర్ధారించుకుని అడ్రస్ నమోదు చేసుకోవాలి. అందుకు కావాల్సిన చిరునామా పత్రానలు సమర్పించాలి. గతంలో గెజిటెడ్ అధికారి సంతకంతో వ్యక్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, పుట్టిన తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్ (MRO) జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని చూపాలి. ఓటర్ ఐడీ (Voter ID), పాస్‌పోర్టు (Passport), బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డు (Ration card)లో సరైన చిరునామా ఉంటే వాటితో సరి చేసుకోవచ్చు. అలాగే వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, మొబైల్ బిల్లు, గ్యాస్ బిల్లులను కూడా ధృతపత్రాలుగా వినియోగించుకోవచ్చు.
ఇవి తప్పనిసరి...
తప్పరిసరిగా ఫొటో ఉన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలి. పదో తరగతి మార్కుల జాబితా, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్‌కార్డు ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి జతపర్చాలి. ఉద్యోగులు వారి గుర్తింపు కార్డు, వివాహితులైతే వివాహ ధ్రువపత్రం, తహశీల్దారుచే జారీ చేసే కుల ధ్రువపత్రం సమర్పించవచ్చు.
గతంలో పుట్టిన తేదీ మార్చుకునేందుకు నమూనా పత్రాన్ని భర్తీ చేసి గెజిటెడ్ అధికారులతో సంతకం చేస్తే సరిపోయేది. పాన్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని అధికారికంగా ధ్రువీకరించుకునే వీలు ఉండేది. చిన్నారులకైతే తప్పనిసరిగా మున్సిపల్ లేదా పంచాయతీ నుంచీ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఇది కూడా ఒకసారి మాత్రమే సవరించుకునే వీలు కల్పించారు. రెండోసారి మార్పు చేసుకోవాలనుకుంటే ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లి తగిన వివరణ ఇస్తూ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఇక లింగం తప్పుగా నమోదైతే ఒక సారి మాత్రమే మార్చుకునే వీలుంది. ఇందుకు తప్పనిసరిగా అర్హత గల గుర్తింపు పత్రాన్ని జత చేయాలి. మరోసారి తప్పును సవరించాలంటే ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిందే.
ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..
ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..
Updated Date - 2023-04-03T16:14:49+05:30 IST