Viral Video: ఇదెక్కడి పైత్యం రా బాబూ.. మద్యంతో టీ ఏంటి? అతడికి గిరాకీ ఎలా ఉందో చూడండి..
ABN, First Publish Date - 2023-11-07T19:56:10+05:30
మనదేశంలో చాలా మంది ప్రతి రోజూ టీ తాగుతుంటారు. కొందరు టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. మరికొందరు మద్యపానాన్ని బాగా ఇష్టపడుతుంటారు. చుక్క లోపలికి దిగకపోతే వారికి రోజు పూర్తయినట్టు ఉండదు. టీకి, మద్యానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.
మనదేశంలో చాలా మంది ప్రతి రోజూ టీ (Tea) తాగుతుంటారు. కొందరు టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. మరికొందరు మద్యపానాన్ని (Alchohol) బాగా ఇష్టపడుతుంటారు. చుక్క లోపలికి దిగకపోతే వారికి రోజు పూర్తయినట్టు ఉండదు. టీకి, మద్యానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే ఈ రెండింటిని కలిపి అమ్మితే ఎలా ఉంటుందనే ఆలోచన ఓ వ్యక్తికి వచ్చినట్టుంది. ఆ వ్యక్తి ఏకంగా మద్యంతో టీ (Tea with liquor) తయారు చేస్తున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
గోవాలోని బీచ్‌లో రోడ్డు పక్కనున్న టీ దుఖాణంలో ఓ వ్యక్తి ఓల్డ్ మాంక్ రమ్ (Old Monk Rum)ను కలిపి టీ తయారు చేస్తున్నాడు. ముందుగా చిన్న కుండను నిప్పుల్లో వేడి చేశాడు. అందులో టీ తయారు చేసేందుకు అవసరమైన అన్నింటిని వేశాడు. ఆ తర్వాత టీలో పాలకు బదులుగా ఓల్డ్ మాంక్ రమ్‌ను కలిపాడు. ఈ టీకి ``ఓల్డ్ మాంక్ చాయ్`` (Old Monk Tea)అని పేరు కూడా పెట్టాడు. ఈ టీ తాగేందుకు అతడి దుకాణం ముందు చాలా మంది బారులు తీరుతున్నారు. ఈ వీడియో చూసి ఛాయ్ ప్రియులు, మద్యం ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shocking Video: నెమలిని తక్కువగా అంచనా వేసింది.. గుడ్లు దొంగిలిస్తుంటే ఎలా కిక్ ఇచ్చిందో చూడండి..
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.5 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ రమ్ ఛాయ్‌ను కొందరు ఇష్టపడుతుంటే, మరికొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. ``ఇది వెరైటీ కాంబినేషన్.. టేస్ట్ చూడాలని ఉంది``, ``ఈ టీ తాగిన వారు నరకానికి వెళతారు``, ``ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి టీని ట్రై చేయొచ్చు``, ``టీ ప్రియుల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-11-07T19:56:12+05:30 IST