ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: ఆస్ట్రేలియా గగనతలంపై చంద్రయాన్-3.. వైరల్ అవుతున్న సూపర్ ఫొటో!

ABN, First Publish Date - 2023-07-16T14:03:50+05:30

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 14వ తేదీన చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ నెల 14వ తేదీన చంద్రయాన్‌-3 (Chandrayaan-3)ని విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రుని (Moon) దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది. ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి చివరికి ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై దిగనుంది.

చంద్రయాన్-3కి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి (Chandrayaan-3 Viral Photos). చంద్రయాన్-3ని ప్రయోగించిన అరగంట తర్వాత ఆస్ట్రేలియా (Australia) గగనతలం నుంచి వెళ్తుండగా ఆ దేశానికి చెందిన డైలాన్ డానెల్ అనే అంతరిక్ష ఔత్సాహికుడు తన ఇంటి మేడ మీద నుంచి ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రాత్రి సమయంలో తీసిన ఆ ఫొటోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అద్భుతంగా ఫొటోలు తీసిన డానెల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు (Chandrayaan-3's night sky picture).

Viral Video: వీళ్లెవరో కానీ.. డబ్బు విలువ బొత్తిగా తెలియదనుకుంటా.. కోట్ల విలువైన ఫెరారీ కారును ఎలా వాడుతున్నారో చూస్తే..!

``ఇండియన్ స్పేష్ ఏజెన్సీ చంద్రయాన్-3 ని లాంఛ్ చేస్తుండగా యూట్యూబ్ ద్వారా లైవ్ చూశాను. అరగంట తర్వాత ఆ రాకెట్ ఆస్ట్రేలియాలోని మా ఇంటి పై నుంచి కనిపించింది. కంగ్రాట్స్ ఇస్రో..`` అంటూ డానెల్ ట్వీట్ చేశారు. తను తీసిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోను దాదాపు 7.5 లక్షల మంది వీక్షించారు. ఆ ఫొటో అద్భుతంగా వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-16T14:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising