ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిప్టులు తేవొద్దు.. కానీ ఒక్క కండీషన్ అంటూ పెళ్లికార్డుపై ముద్రించి మరీ.. పెళ్లయిన వెంటనే ఈ వధూవరులు చేసిన పనేంటంటే..

ABN, First Publish Date - 2023-02-03T15:29:44+05:30

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వధూవరులు అందరిలా కాకుండా సమాజానికి సందేశం ఇస్తూ తీసుకున్న నిర్ణయం.. అందరి ప్రశంసలను అందుకుంటోంది. గిఫ్టులు తేవొద్దు.. కానీ ఓ కండీషన్ అంటూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఏం అంశమైనా నెట్టింట చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఇటీవల వధూవరులు.. తమ వివాహ కార్యక్రమంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. తద్వారా సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వధూవరులు అందరిలా కాకుండా సమాజానికి సందేశం ఇస్తూ తీసుకున్న నిర్ణయం.. అందరి ప్రశంసలను అందుకుంటోంది. గిఫ్టులు తేవొద్దు.. కానీ ఓ కండీషన్ అంటూ పెళ్లి కార్డులు ముద్రించారు. ఇంతకీ వీరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాజ్‌నంద్‌గావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన నగేష్ యాదు, యువతి దుర్చాషణిల వివాహం (marriage) గురువారం స్థానిక సింధు భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. వధూవరులు తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వివాహ పత్రికలను అందరిలా కాకుండా వినూత్నంగా ఫ్రింట్ చేయించి, అందరికీ ఆహ్వానాలు అందజేశారు. అతిథలు ఎవరూ గిప్టులు తేవొద్దు.. అందుకు బదులుగా ప్రతి ఒక్కరూ రక్తదానం (blood donation) చేయాల్సిందిగా మనవి.. అంటూ సందేశం పంపారు.

ఈ ఫొటోలోని కుర్రాడికి పెద్ద కథే ఉంది.. 10 ఏళ్ల తర్వాత కూడా పోలీసులు అతడిని వెతుక్కుంటూ ఎందుకు వెళ్లారంటే..

దీంతో ఈ వివాహ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకు తగ్గట్టుగా అధిక సంఖ్యలో హాజరైన బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా.. రక్తదానం చేసి, వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. ఈ వేడుకలో మొత్తం 41 మంది రక్తదానం చేశారు. వరుడు నగేష్ యాదు 47వ సారి రక్తదానం చేసి, ఈ కార్యక్రమ ఉద్దేశం గురించి అందరికీ వివరించారు. అనంతరం రక్తదానం చేసిన వారందరికీ సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేశారు. తొలిసారిగా తన వివాహ వేడుకలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని అనుకున్నట్లు నాగేష్ యాదు తెలిపారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Viral photos and videos) వైరల్ అవడంతో.. వధూవరులను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Viral Video: యువతి ఫొటో తీస్తుండగా ఏకంగా ఫోన్‌నే మింగేసిన ఏనుగు.. చివరకు మావటి ఏం చేశాడంటే..

Updated Date - 2023-02-08T12:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising