ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

iPhone: 3 రోజులు.. 21 లక్షల లీటర్ల నీళ్లు.. ఒక్క ఐఫోన్ కోసం ఈ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం గుర్తుంది కదా.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-05-30T18:09:01+05:30

అసలే వేసవి కాలం. తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటారు. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్తేనే గానీ నీళ్లు దొరకని పరిస్థితులు ఉంటాయి. సహజంగా ఈ

iPhone
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసలే వేసవి కాలం. తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటారు. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్తేనే గానీ నీళ్లు దొరకని పరిస్థితులు ఉంటాయి. సహజంగా ఈ సమయంలో చెరువులు... కుంటలు ఎండిపోతుంటాయి. ఇక బావుల్లో కూడా నీళ్లుండవు.. బోర్లు ఎండిపోతాయి. పైగా కరెంట్ కూడా సరిగ్గా ఉండదు. ఇంత దారుణమైన పరిస్థితులుంటాయి సమ్మర్‌లో... ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఓ అధికారి చేసిన పనికి రైతులు.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇంతకీ ఏమైందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఛత్తీస్‌గఢ్‌కు (chhattisgarh) చెందిన రాజేశ్‌ విశ్వాస్‌ అనే వ్యక్తి.. కాంకేర్‌ జిల్లాలో ఫుడ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల అతడు స్థానికంగా ఉన్న ఖేర్‌కట్టా డ్యామ్ సందర్శనకు వచ్చాడు. ఆ సమయంలో సెల్ఫీ తీసుకుంటుండగా స్మార్ట్‌ఫోన్ (phone) ఓవర్‌ ఫ్లో ట్యాంక్ నీటిలో పడిపోయింది. రూ.లక్ష ఖరీదైన ఫోన్ కావడం.. పైగా అందులో విలువైన అధికారిక సమాచారం ఉందని చెప్పడంతో దాన్ని కనిపెట్టేందుకు ఈతగాళ్లను రంగంలోకి దించారు. 15 అడుగుల లోతైన నీళ్లలో ఎంత వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో జలవనరుల విభాగం అధికారికి సమాచారం ఇచ్చిన ఆ అధికారి.. రెండు భారీ మోటార్లతో నీళ్లను ఖాళీ చేయించారు. గత సోమవారం సాయంత్రం నుంచీ గురువారం వరకూ మూడు రోజుల్లో దాదాపు 41 లక్షల లీటర్ల నీళ్లను బయటకు తోడేశారు. ఈ నీటితో దాదాపుగా 1500 ఎకరాల సాగునీటి అవసరాలు తీరనున్నట్లు సమాచారం. ఇంకో వైపు ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతుంటే ఈ స్థాయిలో నీటి వృథా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధికారులు... విశ్వాస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు(officer suspended).

ఇదిలా ఉంటే నీటిని వృథా (water pumped) చేసినందుకు గాను.. ఆ అధికారి నుంచి డబ్బు వసూలు చేసే విషయమై ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజినీర్.. జలవనరుల శాఖ ఎస్‌డీవో రాంలాల్‌ ధివర్‌‌కు లేఖ రాశారు. రిజర్వాయర్ నీరు వ్యవసాయానికి.. వేసవిలో ఇతర అవసరాలకు వినియోగిస్తారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు వినియోగించే నీటిని వృథా చేసినందుకు.. దానికి విలువ కట్టి.. ఎందుకు వసూలు చేయకూడదని ప్రశ్నించారు. దీనిపై వివరణ కోరారు. ఇదిలా ఉంటే.. ఆ ఫోన్‌ను బయటకు తీసేందుకు కొంత మేర నీళ్లను తోడేందుకే అనుమతి ఇచ్చామని, కానీ చాలా ఎక్కువే ఖాళీ చేశారని జలవనరుల విభాగం అధికారి వివరణ ఇచ్చారు. ఎట్టకేలకు ఫోన్‌ను బయటకు తీసినప్పటికీ.. అది మూడు రోజుల పాటు నీటిలో ఉండేసరికి పనిచేయడం లేదని తెలిసింది.

ఇది కూడా చదవండి: Bride: ఆ అమ్మాయే కావాలంటూ 13 రోజుల పాటు వధువు ఇంట్లో వరుడు మకాం.. కాసేపట్లో పెళ్లనగా వధువు వెళ్లిపోవడంతో..!

Updated Date - 2023-05-30T18:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising