ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: వామ్మో.. ఇదేం రాక్షస ప్రేమ తల్లీ.. ప్రియుడు ఎక్కడ దక్కకుండా పోతాడేమోనని రూ.5 కోట్లు కొట్టేసింది..!

ABN, First Publish Date - 2023-07-26T15:54:52+05:30

చైనాకు చెందిన ఓ మహిళ తన ప్రియుడితో ప్రేమలో బాగా కూరుకుపోయింద. అతడు తనకు ఎక్కడ దూరమవుతాడో అని నిరంతరం భయపడుతూ ఉండేది. ప్రేమించిన వ్యక్తి ఎప్పటికీ దూరం కాకుండా ఉండాలంటే క్షుద్రపూజలు చేయించాలని ఓ స్నేహితురాలు చెప్పడంతో అందుకు సిద్ధమైంది.

చైనా (China)కు చెందిన ఓ మహిళ తన ప్రియుడితో ప్రేమలో (Love) బాగా కూరుకుపోయింది. అతడు తనకు ఎక్కడ దూరమవుతాడో అని నిరంతరం భయపడుతూ ఉండేది. ప్రేమించిన వ్యక్తి ఎప్పటికీ దూరం కాకుండా ఉండాలంటే చేతబడి (Black Magic) చేయిస్తే మంచిదని నమ్మి అందుకు సిద్ధమైంది. ఆ చేతబడి కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. ఆ డబ్బులను తన ఆఫీస్ నుంచి కాజేసింది. ఆ మహిళ రాక్షస ప్రేమ చాలా మందికి షాకిచ్చింది (Crime News).

ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ అనే మహిళ చాలా రోజులుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఆమె పలు దఫాలుగా తన ఆఫీస్ నుంచి డబ్బును కాజేస్తోంది (Theft in Office). ఆ విషయాన్ని చాలా లేటుగా కంపెనీ యాజమాన్యం గుర్తించింది. అప్పటికి ఆమె దాదాపు రూ.5 కోట్లు ఆఫీస్ నుంచి దొంగిలించింది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఆ డబ్బంతా ఏం చేసిందో తెలుసుకుని పోలీసులు కూడా షాకయ్యారు. తన ప్రియుడితో సఖ్యత ఎలా పెంచుకోవాలని ఆమె చాలా రోజులు ఇంటర్నెట్‌లో శోధించింది.

Musical Road: వావ్.. ఇదేం అద్భుతం.. స్పీడ్‌గా కారు వెళ్తోంటే.. రోడ్డులోంచి సంగీతం వచ్చేస్తోంది..!

వాంగ్ తన కోరికలను నెరవేర్చుకోవడానికి మతపరమైన ఆచారాలపై ఆధారపడింది. చేతబడి చేసే మంత్రగాడిని మనస్ఫూర్తిగా నమ్మింది. తన ఆఫీస్ నుంచి రూ.5 కోట్లు తీసుకొచ్చి ఆ పూజల కోసం వినియోగించింది. ఆమంత్రగాడు చెప్పినట్టు చేసింది. ఆరెస్ట్ అయిన తర్వాత కూడా వాంగ్ ఆ పూజలపై నమ్మకం కోల్పోలేదు. ఇక, తన ప్రియుడు తనకు ఎప్పటికీ దూరం కాడని ఆమె పోలీసుల ఎదుట కూడా చెప్పడం గమనార్హం.

Updated Date - 2023-07-26T15:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising