Viral: వైద్య రంగంలోనే అత్యంత అరుదైన కేసు.. 31 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ.. 92 ఏళ్లకు డెలివరీ!
ABN, First Publish Date - 2023-08-20T10:28:23+05:30
సాధారణంగా మానవుల్లో గర్భధారణ (Pregnancy) కాలం దాదాపు 9 నెలలు. మహిళలు గర్భం దాల్చిన తర్వాత 9 నెలల్లో ప్రసవం (Delivery) జరుగుతోంది. ఒక్కోసారి ఒక్కొక్కరికి నెల ముందు లేదా నెల తర్వాత డెలివరీ అవుతుంది. అంతకు మించి గర్భధారణ సమయంలో పెద్దగా తేడా ఉండదు.
సాధారణంగా మానవుల్లో గర్భధారణ (Pregnancy) కాలం దాదాపు 9 నెలలు. మహిళలు గర్భం దాల్చిన తర్వాత 9 నెలల్లో ప్రసవం (Delivery) జరుగుతోంది. ఒక్కోసారి ఒక్కొక్కరికి నెల ముందు లేదా నెల తర్వాత డెలివరీ అవుతుంది. అంతకు మించి గర్భధారణ సమయంలో పెద్దగా తేడా ఉండదు. అయితే చైనా (China)కు చెందిన ఓ మహిళ ఏకంగా 60 సంవత్సరాల పాటు గర్భంతో ఉంది. 31 ఏళ్ల వయసులో గర్భవతి అయిన ఆ మహిళకు 92 ఏళ్ల వయసులో డెలివరీ అయింది. వైద్య రంగంలోనే అత్యంత అరుదైన ఆ కేసు ఎంతో మందికి ఆసక్తి కలిగిస్తోంది.
చైనాకు చెందిన హువాంగ్ యిజున్(92) అనే మహిళ1948లో తనకి 31 ఏళ్ల వయసు ఉండగా గర్భం దాల్చింది. అయితే ఆమెకు ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఆమెను పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. పిండం గర్భాశయం (womb) లోపల కాకుండా, బయట పెరుగుతోందని, వెంటనే అబార్షన్ (Abortion) చేయించుకోకపోతే తల్లికి, బిడ్డకు ప్రమాదమని చెప్పారు. అయితే పేద కుటుంబానికి చెందిన హువాంగ్ వద్ద అబార్షన్ చేయించుకునేందుకు డబ్బులు లేవు. దీంతో ఆమె ఏం జరుగుతుందో జరగనీ అని ఆ గర్భాన్ని అలాగే వదిలేసుకుంది.
Snake Video: బాబోయ్.. నీ ధైర్యానికి దండం తల్లోయ్.. ఒక్కటే అనుకుంటే.. ఒకేసారి బయటపడిన రెండు పాములు.. చివరకు..!
కడుపులో పిండం ఉన్నా హువాంగ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు (Ectopic pregnancy). పిండం పెరగడం కానీ, కడుపు నొప్పి రావడం, బ్లీడింగ్ కావడం లాంటి సమస్యలు ఎదురు కాలేదు. దీంతో హువాంగ్ 60 ఏళ్ల పాటు ఆ పిండాన్ని తన కడుపులో మోసింది. చివరకు 2009లో 92 ఏళ్ల వయసులో ఆమె కడుపునొప్పి కారణంగా వైద్యులను ఆశ్రయించారు. ఆమె గర్భంలో స్టోన్ బేబీ (Stone Baby)లా మారిపోయిన పిండాన్ని చూసి డాక్టర్లు షాకయ్యారు. వెంటనే సర్జరీ చేసి ఆమె కడుపులో నుంచి ఆ పిండాన్ని బయటకు తీశారు. ఎలాంటి ఆరోగ్య సమస్యా లేకుండా చనిపోయిన పిండంతో 61 ఏళ్ల పాటు ఆమె అలాగే ఉండిపోవడం చాలా షాకింగ్‌గా అనిపించిందని వైద్యులు పేర్కొన్నారు.
Updated Date - 2023-08-20T10:28:23+05:30 IST