ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coconut water: వేసవిలో కొబ్బరినీళ్ళు ఎగబడి తాగేస్తున్నారా? మీకు ఈ సమస్య ఉంటే మాత్రం రిస్క్ చేస్తున్న్టటే..

ABN, First Publish Date - 2023-03-20T11:10:27+05:30

బోలెడు పోషకాలను శరీరానికి అందించే కొబ్బరినీళ్ళు అమృతమే అనుకోవచ్చు. కానీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేసవికాలం రాగానే మార్కెట్లో కొబ్బరి నీళ్ళకు డిమాండ్ పెరుగుతుంది . బయట కూల్డ్రింకులు, కూల్ వాటర్ తాగేబదులు ప్రకృతి సిద్దమైన కొబ్బరి నీళ్ళు తాగడం మంచిదని సాధారణ వ్యక్తుల నుండి ఆరోగ్య నిపుణుల వరకు చెప్పే అభిప్రాయం. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి, బోలెడు పోషకాలను శరీరానికి అందించే కొబ్బరినీళ్ళు అమృతమే అనుకోవచ్చు. కానీ ఈ కొబ్బరి నీళ్ళు కొందరికి చాలా ప్రమాదమనే మాట కాస్త షాక్ ఇచ్చే విషయం. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్ళు తాగితే చాలా రిస్క్ చేసినట్టే.. ఈ నేపథ్యంలో కొబ్బరినీళ్ళు ఎవరు తాగకూడదు? ఎందుకు తాగకూడదు? తెలుసుకుంటే..

మండే ఎండల్లో రోడ్డు పక్కన ఓ కొబ్బరి బోండం కొట్టించుకుని తాగితే ప్రాణం లేచొచ్చినట్టే ఉంటుంది. ఎన్ని మంచినీళ్ళు తాగినా దాహం తీరని సమయంలో కొబ్బరినీళ్ళు(Coconut Water) మ్యాజిక్ చేస్తాయి. కాల్షియం(Calcium), మెగ్నీషియం(Magnesium), ప్రోటీన్(Protein), సోడియం(Sodium), పొటాషియం(Potassium), పాస్పరస్(Phosphorus) వంటి ఖనిజాలే కాక విటమిన్-బి2(Vitamin-B2), విటమిన్-బి3(Vitamin-B3), విటమిన్-సి(Vitamin-C) కొబ్బరినీళ్ళలో సమృద్దిగా లభిస్తాయి. చర్మానికి మెరుపును ఇవ్వడం(Glowing Skin), ముడుతలు తొలగించడం(Wrinkles),శరీరాన్ని హైడ్రేట్ గా(Body Hydrate) ఉంచడం, శరీరంలో వేడి తగ్గించడం(Control Body temperature) తగ్గించడంలో కొబ్బరి నీళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరినీటిని తీసుకోకూడదు.

సిస్టిక్ ఫైబ్రోసిన్(Cystic fibrosis) సమస్య ఉన్నవారు కొబ్బరినీటిని తీసుకోకూడదు. ప్యాంక్రియాస్(Pancreas), కాలేయం(Liver), మూత్రపిండాలు(Kidneys), ప్రేగుల(Intestine) మీద ఈ సిస్టిక్ ఫైబ్రోసిన్ ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితిలో కొబ్బరినీటిని తీసుకుంటే ప్రమాదం మరింత పెరుగుతుంది. కొబ్బరినీటిలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలను దారుణంగా దెబ్బతీస్తాయి.

బీపీ(Blood pressure) ఇప్పట్లో చాలామందికి ఉన్న ఒక సహజ సమస్య. బీపీ ఉన్నవాళ్ళు కొబ్బరినీళ్ళు తాగడం రిస్క్ అంటున్నారు వైద్య నిపుణులు. కొబ్బరినీళ్ళు తాగాలని అనుకుంటే ముందు వైద్యులను సంప్రదించి వారి సలహా మీద మాత్రమే కొబ్బరినీళ్లు తాగాలి.

ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలామంది కొబ్బరినీళ్ల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఏవైనా ఆపరేషన్లు జరిగేముందు లేదా ఆపరేషన్లు జరిగిన తరువాత కొబ్బరినీళ్ళు తాగకూడదు.

చాలామంది బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు కొబ్బరినీళ్ళు తాగడం మంచిదని అనుకుంటారు. కానీ కొబ్బరినీళ్ళలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మరింత బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి కొబ్బరినీరు తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.

కొబ్బరినీళ్ళు సాధారణం కంటే ఎక్కువగా తాగేవారి విషయంలో పెద్ద షాకింగ్ నిజమే బయటపడింది. కొబ్బరినీళ్లలో ఉన్న అధిక పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ సమస్యలు సృష్టిస్తుంది. ఫలితంగా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది.

కాబట్టి వేసవిలో కొబ్బరినీళ్ళు ఎన్నైనా తాగొచ్చు.. ఏమీ కాదు అనుకునేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Read also: బోలెడు రోగాలు బాధిస్తున్నాయా? రాత్రి పడుకునే ముందు బొడ్డు దగ్గర ఇలా చేసి చూడండి.. ఫలితం చూసి మీరే షాకవుతారు..


Updated Date - 2023-03-20T11:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising