ఆయనో డాక్టర్.. ఆమె ఓ ప్రొఫెసర్.. భార్యాభర్తలిద్దరూ జాబ్స్‌కు రిజైన్ చేసి ఆవుల పెంపకం.. ఎందుకీ నిర్ణయం అని అడిగితే..
ABN, First Publish Date - 2023-01-05T20:23:20+05:30
లక్షల జీతం వచ్చే ఉద్యోగాలకు ఉన్నట్టుండి రాజీనామా చేసి, వ్యవసాయం చేసిన వాళ్లను చాలా మందిని చూశాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వదిలేసి, సొంతూరికి వచ్చి చిన్న చిన్న పనులను చేసిన వాళ్లను కూడా చూశాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతులు కూడా..
లక్షల జీతం వచ్చే ఉద్యోగాలకు ఉన్నట్టుండి రాజీనామా చేసి, వ్యవసాయం చేసిన వాళ్లను చాలా మందిని చూశాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వదిలేసి, సొంతూరికి వచ్చి చిన్న చిన్న పనులను చేసిన వాళ్లను కూడా చూశాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతులు కూడా ఈ కోవకే చెందుతారు. అయితే వీరు విచిత్రంగా ఆవుల పెంపకాన్ని ఎంచుకున్నారు. వైద్య వృత్తిలో ఉన్న భర్త, ప్రొఫెసర్‌గా ఉన్న భార్య.. తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి.. ఆవుల పెంపకంపై దృష్టి పెట్టారు. ఈ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాల్లోకి వెళితే..
బీహార్ (Bihar) ముజఫర్‌పూర్ పరిధి ఖబ్రా ప్రాంతానికి చెందిన శంకర్ నామన్.. హోమియో వైద్యుడిగా (Homeopathic Doctor) పని చేస్తుంటాడు. ఇతడి భార్య సాధన ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. వీరికి 12ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న ఈ దంపతులు.. ఐదేళ్ల క్రితం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఓ రోజు శంకర్ నాయక్.. స్థానిక బస్టాండ్ పరిసరాల్లో కొన్ని ఆవులు.. ప్లాస్టిక్ పేపర్లు, చెత్తాచెదారం తింటూ కనపడ్డాయి. వాటిని చూడగానే చలించిపోయాడు. ఇంటికి వచ్చి ఇదే విషయాన్ని భార్యకు కూడా చెప్పాడు. ఆవులను ఇంటికి తీసుకురావాలని వారి కొడుకు పట్టుబట్టాడు. చివరకు రెండు మూడు ఆవులను ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి వాటిని దగ్గరుండి చూసుకునేవారు. ఆవుల పెంపకంపై (Cattle rearing) అవగాహన లేకపోవడంతో మొదట్లో వీరు ఇబ్బంది పడ్డారు. తర్వాత శంకర్ భార్య.. ఆవుల పెంపకం గురించి తెలుసుకుంది. అలాగే డాక్టర్ రామన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా ఆవు పేడ, ఆవు మూత్రంతో వివిధ పదార్థాలను తయారు చేయడంలో శిక్షణ తీసుకున్నారు.
అనంతరం ఈ దంపతులిద్దరూ ఉద్యోగాలకు (Govt Jobs) రాజీనామా చేసి, పూర్తిగా ఆవుల పెంపకంపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం వీరి వద్ద సుమారు 19ఆవుల వరకూ ఉన్నాయి. ఈ దంపతులు ప్రస్తుతం ఆవు పేడతో (cow dung) పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దీపాలు, కుండలు, విగ్రహాలు తయారు చేస్తుంటారు. రక్షాబంధన్ రోజున ఆవు పేడతో తయారు చేసిన రాఖీలను తొలిసారిగా తయారు చేశారు. ముజఫర్‌పూర్ ప్రజలు ఈ రాఖీలను ఎంతో ఇష్టపడుతుంటారు. అదేవిధంగా వివిధ రకాల పంట సాగులో వినియోగించే మందులు తదితరాలను కూడా గోమూత్రంతో తయారు చేస్తుంటారు. బీహార్‌లో చాలా మంది వ్యవసాయం, ఆవుల పెంపకానికి దూరమవుతున్నారని శంకర్ నామన్ దంపతులు తెలిపారు. తాము మాత్రం ఆవుల పెంపకాన్ని గొప్ప పనిగా భావిస్తున్నట్లు చెప్పారు. వీధుల్లో ఎక్కడా ఆవులు కనిపించకూడదనేదే తమ ఉద్దేశమని పేర్కొంటున్నారు.
భర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..
Updated Date - 2023-01-05T20:23:25+05:30 IST