ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: ఛీ..ఛీ.. ఏం మనిషివయ్యా.. 10 ఏళ్ల పాపకు రూ.10 ఆశ చూపి పాడు పని.. చాటుగా ఓ పిల్లాడు వీడియో తీయడంతో..!

ABN, First Publish Date - 2023-08-09T18:15:57+05:30

కొందరు అప్పటి వరకూ మనుషులుగా ఉంటూ.. ఒంటరిగా ఉన్న మహిళలను చూడగానే ఒక్కసారిగా మానవ మృగాలుగా మారిపోతున్నారు. బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసుతో నిమిత్తం లేకుండా అందరిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా...

ప్రతీకాత్మక చిత్రం

కొందరు అప్పటి వరకూ మనుషులుగా ఉంటూ.. ఒంటరిగా ఉన్న మహిళలను చూడగానే ఒక్కసారిగా మానవ మృగాలుగా మారిపోతున్నారు. బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసుతో నిమిత్తం లేకుండా అందరిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా ఇలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజగా, రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడు. పదేళ్ల పాపకు రూ.10లు ఆశ చూపించి పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఓ బాలుడు చాటుగా వీడియో తీయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ (Rajasthan) ధోల్‌పూర్ జిల్లా కంచన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ పదేళ్ల బాలిక (ten year old girl) .. ఇటీవల ఓ రోజు వారి పొలానికి వెళ్లింది. తర్వాత అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆనర్ సింగ్ అనే వ్యక్తి బాలికను గమనించాడు. వెనుకే ఫాలో అవుతూ వెళ్లి.. నిర్మానుష్య ప్రదేశంలో ఒక్కసారిగా బాలికను నిలిపేశాడు. ఆమెకు రూ.10లు ఆశ చూపించి, సమీపంలోని పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అఘాయిత్యానికి (Misbehavior with a girl) పాల్పడ్డాడు. ఇంటి వద్ద ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Lady Constable: నా భార్య కానిస్టేబుల్ అంటూ గొప్పగా చెప్పుకునే భర్తను.. ఆమే చంపేసింది.. అసలు కథేంటంటే..!

ఈ ఘటనను మొత్తం దూరం నుంచి గమనించిన ఓ బాలుడు.. తన ఫోన్‌లో వీడియో (Video) తీశాడు. తర్వాత ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో చివరకు బాలిక తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పట్లో 12మంది సాక్షులను కోర్టులో హాజరుపరచారు. వాదోపవాదాలు విన్న కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. నిందితుడి అనర్ సింగ్‌ను దోషిగా నిర్ధారిస్తూ నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష, పోక్సో చట్టం కింద నెల జైలు శిక్షతో పాటూ రూ.21వేల జరిమానా విధించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Viral: భార్య ఫోన్‌కు వచ్చిన ఒకే ఒక్క వాట్సప్ మెసేజ్.. ఈ భర్త లైఫ్‌నే మార్చేసింది.. ఈ ఉద్యోగం వేస్ట్ అంటూ రిజైన్ చేసి మరీ..!

Updated Date - 2023-08-09T18:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising