ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: కొడుకు ఆర్మీ ఆఫీసర్ అయ్యాడని తల్లిదండ్రులు కూడా నమ్మేశారు.. అదే చెప్పి పెళ్లి కూడా చేశారు.. కానీ ఒక్క మిస్టేక్‌తో..

ABN, First Publish Date - 2023-06-27T14:42:09+05:30

ఎంతో మంది కుర్రాళ్ళు ఆర్మీ ఉద్యోగమనే కల కోసం కష్టపడతారు. ఆ కుర్రాడు అలాగే ఆర్మీ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. ఆర్మీలోనే సైనికుడిగా పనిచేసి రిటైరైన అతని తండ్రి అతనికి మరింత స్పూర్తిగా నిలిచాడు. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టం. రాతపరీక్షలు మాత్రమే కాకుండా దేహదారుఢ్య పరీక్షలలో కూడా సత్తా చాటినప్పుడే దేశసరిహద్దులో సైనికుడిగా నిలబడే అవకాశం వస్తుంది. ఎంతో మంది కుర్రాళ్ళు ఈ కలకోసం కష్టపడతారు. ఆ కుర్రాడు అలాగే ఆర్మీ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. ఆర్మీలోనే సైనికుడిగా పనిచేసి రిటైరైన అతని తండ్రి అతనికి మరింత స్పూర్తిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తను ఆర్మీ ఆఫీసర్ అయినట్టు అపాయింట్మెంట్ లెటర్ కూడా తల్లిదండ్రులకు చూపించాడు. ఆ సంతోషంలోనే తల్లిదండ్రులు అతనికి ఓ మంచి సంబంధం చూసి పెళ్ళి కూడా చేశారు. కానీ ఆ తరువాత అసలు నిజాలు బయటపడ్డాయి. అందరినీ షాక్ కు గురిచేసే ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర(Maharashra) రాష్ట్రం సాంగ్లీ జిల్లా, అమృతవాడి గ్రామంలో ప్రమోద్ యాదవ్(27) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు(retair solder). ప్రమోద్ కు కూడా మిటలరీలో ఉద్యోగం చేయాలని ఆశ. కానీ ఆర్మీలో ఎంపిక కాలేదు. అయితే తాను ఆర్మీ ఆఫీసర్ అయ్యానని తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించాడు(fake army officer). దానికి తగినట్టే అపాయింట్మెంట్ లెటర్ గట్రా చూపించాడు. తల్లిదండ్రులు అతనికి సంతోషంగా పెళ్లిచేశారు. ఇతను పూణేలోని మిలటరీ ఇంటెలిజెన్స్ ఆర్మీ(pune milatary intelligance army)లో రిక్రూట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి 13మంది యువకులను నమ్మించాడు. ఇందుకోసం ఒక్కొక్కరి దగ్గరా 90వేల నుండి 4.5లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా 13మంది దగ్గరా గుంజాడు. అతను డబ్బు తీసుకుని రిక్రూట్మెంట్ ఇప్పించకపోవడంతో సదరు కుర్రాళ్ళు కోంధ్వా పోలిస్ స్టేషన్ లో ప్రమోద్ మీద ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు కుర్రాళ్ళను సైబర్ క్రైమ్ వారిని సంప్రదించమని చెప్పడంతో వారు సైబర్ క్రైమ్ ను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ వారు ప్రమోద్ గురించి విచారణ చేసిన నేపథ్యంలో ఈ తతంగం అంతా బయటపడింది.

Aunties vs Couple: మెట్రో రైల్లో కొత్త జంట సరసాలు.. ఇదేం పనంటూ హెచ్చరించిన మహిళలు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!


కుర్రాళ్ళ ఫిర్యాదు మేరకు ప్రమోద్ ను అతని రహస్య స్థావరం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మరిన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అతను నకిలీ కాల్-అప్ లెటర్ లు(fake call-up letters), గుర్తింపు కార్డులను(id cards) సృష్టించి అందరినీ మోసం చేస్తున్నట్టు తెలిసింది. కాగా ఇటీవల జరిగింది నాలువ వివాహమని, పలువురు మహిళలను మోసం చేసినట్టు బయటపడింది. ఓ మహిళ దగ్గర ఏకంగా 16లక్షల రూపాయలు తీసుకుని మోసంచేసినట్టు తెలిసింది సైబర్ క్రైమ్ వారు టెక్నికల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అతన్నిగుర్తించి అరెస్ట్ చేశారు.

Mother Video: 16 రోజుల తర్వాత.. కొడుకు కోమాలోంచి బయటికొచ్చాడని ఆ తల్లికి తెలిసి.. పరుగులు తీస్తూ ఆస్పత్రికి వచ్చి..!


Updated Date - 2023-06-27T14:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising