ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Curd: పెరుగు పులుపెక్కిందా..? ఈ టెక్నిక్‌తో దాని రుచిని మళ్లీ మార్చేయడం యమా ఈజీ..!

ABN, First Publish Date - 2023-09-07T15:41:17+05:30

కొందరు ఈ పుల్ల పెరుగును పారెయ్యలేక కొన్నిరకాల వంటకాలలో ఉపయోగిస్తారు. మరికొందరు పారేస్తుంటారు. అయితే బాగా పుల్లబడిన పెరుగును పారెయ్యక్కర్లేకుండా ఆస్వాదిస్తూ తినాలంటే ఓ సింపుల్ ట్రిక్ పాటిస్తే చాలు

పెరుగు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది. భారతీయులే కాదు అన్ని దేశాల ప్రజలు పెరుగును ఇష్టంగా తింటారు. దేవుడి అభిషేకాల నుండి స్వీట్లు, ఎన్నో రకాల వంటకాల వరకు పెరుగును ఉపయోగిస్తారు. భోజనం చివర పెరుగు లేకపోతే తిన్న తృప్తి ఉండదు. అయితే పెరుగు తాజాగా ఉంటేనే దాని రుచిని ఆస్వాదించగలం. పెరుగు తోడుకున్న తరువాత దాన్ని సరిగా జాగ్రత్త చేయకపోయినా, పెరుగు ప్యాకెట్లు ఫ్రిజ్ లో పెట్టడం మరిచిపోయినా పుల్లగా మారిపోతుంది. పులుపు ఎక్కిన పెరుగును వాడటం కాస్త ఇబ్బంది. కొందరు ఈ పుల్ల పెరుగును పారెయ్యలేక కొన్నిరకాల వంటకాలలో ఉపయోగిస్తారు. మరికొందరు పారేస్తుంటారు. అయితే బాగా పుల్లబడిన పెరుగును పారెయ్యక్కర్లేకుండా ఆస్వాదిస్తూ తినాలంటే ఓ సింపుల్ ట్రిక్ పాటిస్తే చాలు. ఇది ఎంతో సులువు కూడా..

పుల్లబడిన పెరుగు(sour curd)ను తిరిగి తాజాగా మార్చడం ఎంతో తేలిక. సాధారణంగా పులుపెక్కిన పెరుగులో నీరు ఊరుతుంది. మొదట స్ట్రైనర్ సహాయంతో ఈ నీటిని వడగట్టాలి. ఆ తరువాత క్రీమ్ గా ఉన్న పెరుగులో చల్లని నీరు కొద్దిగా పోయాలి. స్పూన్ సహాయంతో దీన్ని నెమ్మదిగా కదిలించాలి. ఇలా కదిలించినప్పుడు పెరుగులో ఉండే మీగడ మిక్స్ కాకుండా జాగ్రత్త పడాలి. ఆ తరువాత దీన్ని కూడా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న క్రీమ్ లాంటి పెరుగులో చాలావరకు పులుపు తగ్గిపోయి ఉంటుంది. ఈ పెరుగులో ఒక కప్పు పాలు వేయాలి. పెరుగు పరిమాణాన్ని బట్టి పాలు ఉపయోగించుకోవాలి. పెరుగులో పాలు వేసిన తరువాత గిన్నె మీద మూత పెట్టి దీన్ని 2-3గంటలపాటు అలా ఉంచేయాలి. ఆ తరువాత తాజాగా, తియ్యగా, మృదువుగా అస్సలు పులుపు లేకుండా, పులుపు వాసన కూడా రాకుండా ఉండే పెరుగు(fresh curd) సిద్దమైపోయినట్టే.

Viral News: గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన కుర్రాడు.. ఇదేం పనయ్యా అని అడిగితే.. చెప్పింది విని అవాక్కైన పోలీసులు..!



ఎక్కువ మొత్తం పెరుగు పుల్లబడినప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చు. ఇకపోతే పెరుగు పుల్లబడటం అనే విషయం వెనుక వివిధ కారణాలు ఉంటాయి. చాలామంది రోజంతా పెరుగు వాడేశాక గిన్నెలో కొద్దిగా పెరుగు మిగిలినప్పుడు అందులోనే పాలు పోసి తోడు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల పెరుగు తక్కువ సమయంలోనే పుల్లగా మారుతుంది. అలాగే వేడిగా ఉన్న ప్రదేశంలో పెరుగు తొందరగా పుల్లబడుతుంది.

Viral Video: మోసం అనే పదానికే అర్థం తెలియని అమాయకురాలు.. రైల్లో వెళ్తూ గొర్రెకు కూడా టికెట్ తీసుకున్న బామ్మ..!


Updated Date - 2023-09-07T15:41:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising