ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అమ్మ బాబోయ్.. ఇలాంటి కూతుళ్లున్న తండ్రుల పని ఔటే.. తల్లి వద్ద తండ్రిని ఎలా ఇరికించేసేందో చూడండి..!

ABN, First Publish Date - 2023-02-18T08:17:00+05:30

చిన్నపిల్లలు ఏ పని చేసిన చాలా క్యూట్‌గా ఉంటది. వారి అమాయకత్వపు మాటలు, వారి చేష్టలు ఇలా ఏది చూసిన ఎంతో ముచ్చట వేస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: చిన్నపిల్లలు ఏ పని చేసిన చాలా క్యూట్‌గా ఉంటది. వారి అమాయకత్వపు మాటలు, వారి చేష్టలు ఇలా ఏది చూసిన ఎంతో ముచ్చట వేస్తుంది. అందుకే చిన్నపిల్లలను ఇష్టపడని వారు ఉండరు. ఇక చిన్న పిల్లల అల్లరి తాలూకు వీడియోలు కూడా బాగానే వైరల్ అవుతుంటాయి. ఇదే కోవకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా హల్‌చల్ చేస్తోంది. ఓ చిన్నారి తల్లి వద్ద తన తండ్రిపై చాడీలు చేప్పే వీడియో అది. ఆమె అమాయకత్వపు మాటలు, తల్లి వద్ద తండ్రిని ఇరికించిన విధానం నెటిజన్లను కట్టిపడేస్తుంది. అదే సమయంలో ఈ వీడియో చూసిన తర్వాత మనం నవ్వకుండా ఉండలేం కూడా.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. తల్లి బయటకు వెళ్లి ఇంటికి రాగానే ఆ చిన్నారి తన తండ్రిపై చాడీలు చెప్పడం మొదలు పెట్టింది. "అమ్మ నీవు బయటకు వెళ్లగానే.. నేను ఆడుకుందామని నాన్న దగ్గరికి వచ్చాను. ఆయన అప్పటికే ఫోన్‌లో మునిగిపోయి ఉన్నాడు. నాన్నను ఆడుకుందామని అడిగితే.. లేదు నేను బిజీగా ఉన్నాను.. నీవే ఆడుకో అని అన్నాడు. ఆ తర్వాత నీవు ఇంట్లోకి రావడం గమనించిన నాన్న.. ఫోన్ వాడుతున్న విషయం నీకు చెప్పకు అని వెంటనే మొబైల్ దాచేశాడు. ఎప్పుడూ చూసిన ఫోన్‌లోనే ఉంటావ్ నాన్న" అని అమ్మ దగ్గర తండ్రిని ఇరికించేసింది. అంతేనా.. "నాన్న నీవు అమ్మను కోపంగా చూడకు. అలా చూస్తే ఆమె బాధపడుతుంది. ఆమె బాధపడితే నేను బాధపడతాను. ఆ తర్వాత నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను ఏడిస్తే ఎలా ఉంటదో తెలుసుగా" అని అమాయకంగా చెప్పడం వీడియోలో ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇన్‌స్టా రీల్స్ కోసం ఈ యువతి వెరైటీగా ట్రై చేద్దామనుకుంది కానీ.. ఒక్క క్షణంలోనే సీన్ ఇలా రివర్స్ అయిపోయింది..!

Updated Date - 2023-02-18T08:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising