ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: ఇదెక్కడి మోసం రా బాబూ.. స్మార్ట్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చి ఏకంగా రూ.7 లక్షలు కొట్టేశాడు.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-03-13T15:15:49+05:30

ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మార్గాలు అన్వేషించి మరీ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుతం సైబర్ నేరాలు (Cyber Crimes) విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మార్గాలు అన్వేషించి మరీ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా ముంబై (Mumbai Crime News) మహానగరంలో ఇటీవలి కాలంలో ఇలాంటి నేరాలు మరింత ఎక్కువైపోతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కేసు పోలీసులకే షాకిచ్చింది. ముంబైకి చెందిన ఓ మహిళకు ఈ ఏడాది జనవరిలో సౌరభ్‌ శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తమ సంస్థ నుంచి క్రెడిట్ కార్డు (Credit Card) తీసుకుంటే నగరంలోని స్పోర్ట్స్ క్లబ్‌లో మెంబర్‌షిప్‌ కూడా లభిస్తుందని చెప్పాడు. బాధితురాలు అతడి మాటలు నమ్మి, కార్డు తీసుకునేందుకు అంగీకరించింది.

ఆ మహిళ ఐఫోన్ వినియోగిస్తున్నట్టు తెలుసుకున్న నిందితుడు ఓ ట్రిక్ ప్లే చేశాడు. తాము ఇచ్చే క్రెడిట్ కార్డు ఆండ్రాయిడ్ ఫోన్‌లో (Android Phone) మాత్రమే పని చేస్తుందని, కార్డు తీసుకుంటానంటే ఓ ఆండ్రాయిడ్ ఫోన్ గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పాడు. దీంతో నిందితుడికి బాధితురాలు తన ఇంటి అడ్రస్‌ పంపింది. అప్పటికే ఆమె క్రెడిట్‌ కార్డ్‌ కోసమని తన ఆధార్, ఇతర వివరాలను అతనికి షేర్‌ చేసి ఉంది. ఆమె అడ్రస్‌ పంపిన రోజే ఇంటికి ఫోన్‌ వచ్చింది. ఆ మొబైల్‌లో DOT సెక్యూర్, సెక్యూర్ ఎన్వాయ్ ఆథెంటికేటర్ అనే రెండు యాప్స్ ఇన్‌స్టాల్‌ అయి ఉన్నాయి. ఆ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మహిళ తన సిమ్ కార్డ్‌ ఇన్‌సర్ట్‌ చేసింది. క్రెడిట్‌ కార్డ్‌ యాక్టివేట్‌ చేసుకోవడానికి మోసగాడు చెప్పిన సూచనలను ఫాలో అయింది.

పాపం.. ఆ మహిళను అత్యాచారం చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు.. వివాహం తర్వాత అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు..

అదే రోజు కొన్ని గంటల తర్వాత ఆ మహిళ మొబైల్‌కు బ్యాంకు ట్రాన్సాక్షన్లకు సంబంధించిన రెండు మెసేజ్‌లు వచ్చాయి. మోసగాడు బెంగుళూరులోని ఒక జ్యువెలరీ షాపులో ఆమె ఖాతాను ఉపయోగించి రూ.7 లక్షలకు షాపింగ్‌ చేశాడు. షాకైన మహిళ బ్యాంకును సంప్రదించి వివరాలను సేకరించి, ఖండేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-13T15:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising