ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bathroom Vs Washroom: బాత్రూమ్, వాష్‌రూమ్ ఒకేలాంటివి కావని, రెస్ట్ రూమ్‌కు సరైన అర్థం ఇదేనని మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-03-22T07:19:33+05:30

difference between bathroom and-washroom: బాత్రూమ్, వాష్‌రూమ్ ఒకేలా అనిపించినా రెండూ ఒకటి కాదు. వాటి మధ్య చాలా తేడా ఉంది. ఇక రెస్ట్ రూమ్‌కు కూడా సరైన అర్థం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

difference between bathroom and washroom: బాత్రూమ్, వాష్‌రూమ్ ఒకేలా అనిపించినా రెండూ ఒకటి కాదు. వాటి మధ్య చాలా తేడా ఉంది. ఇక రెస్ట్ రూమ్‌(rest room)కు కూడా సరైన అర్థం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేసే సదుపాయం ఉన్న గదికి బాత్రూమ్(bathroom) అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే బేసిన్, టాయిలెట్, బాత్ టబ్, షవర్ వంటి సౌకర్యాలు కలిగిన ప్రదేశాన్ని బాత్రూమ్ అంటారు. ఇక్కడున్న ఒక ముఖ్య విషయం ఏమిటంటే దీనికి లింగ రూపంలో విభజన(division) ఉండదు. అంటే బాత్రూమ్ అనేది పురుషులకు, స్త్రీలకు(men and women) విడివిడిగా ఉండదు.

బాత్రూమ్ అనేది ఇళ్లలో తప్పనిసరిగా ఉంటుంది. ఇక టాయిలెట్(toilet) లేదా వాష్ రూమ్ విషయానికొస్తే గదిలో సింక్ కలిగిన ప్రదేశాన్ని వాష్‌రూమ్ అని అంటారు. దీనిలో దుస్తులు మార్చుకునే సౌకర్యం కూడా ఉంటుంది. షాపింగ్ మాల్స్(Shopping malls), విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు తదితర ప్రదేశాలలో వాష్‌రూమ్‌లను గమనించవచ్చు. వాష్ రూమ్‌ అనేది పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఉంటుంది.

ఇక రెస్ట్ రూమ్ విషయానికొస్తే షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు(Railway stations) తదితర ప్రదేశాలలో విశ్రాంతి గదుల పేరిట ఇవి కనిపిస్తాయి. అమెరికా(America) లాంటి దేశాల్లో వాష్‌రూమ్ అనే పదానికి బదులు రెస్ట్‌రూమ్ అనే పదాన్ని వాడుతుంటారు. విదేశీయులు సందర్శించే అవకాశం ఉన్న ప్రదేశాలలో వాష్‌రూమ్‌కు బదులుగా రెస్ట్‌రూమ్‌(Restroom) అని రాయడాన్ని మనం గమనించవచ్చు.

Updated Date - 2023-03-22T08:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising