ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Difference Between CBI And CID: సీబీఐ, సీఐడీ రెండూ ఒకేలాంటివని, వాటి పనితీరూ ఒకటే‌నని అనుకునేవారు... తప్పకుండా ఇది చదవాల్సిందే!

ABN, First Publish Date - 2023-03-16T10:11:13+05:30

Difference Between CBI And CID: మీరు CBI, CID అనే పదాలను వినే ఉంటారు. ఈ విభాగాలకు చెందిన అధికారులకు(authorities) సంక్లిష్టమైన లేదా రహస్య స్థాయి క్రిమినల్ కేసులు అప్పగిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Difference Between CBI And CID: మీరు CBI, CID అనే పదాలను వినే ఉంటారు. ఈ విభాగాలకు చెందిన అధికారులకు(authorities) సంక్లిష్టమైన లేదా రహస్య స్థాయి క్రిమినల్ కేసులు అప్పగిస్తారు. సీబీఐ, సీఐడీ రెండూ వేర్వేరు ఏజెన్సీలు. ఈ రెండింటి పని కూడా భిన్నంగా(differently) ఉంటుంది. ఈ రెండింటి గురించి చాలా మందికి పూర్తి వివరాలు(Details) తెలియదు. ఈ విభాగాల పని ఏమిటో కూడా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

సీబీఐ అంటే...

సీబీఐపై తరచూ చర్చ జరుగుతుంటుంది సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(Central Bureau of Investigation). ఇది కేంద్ర ఏజెన్సీ. ఇది భారత ప్రభుత్వ ఆదేశాలపై దేశంలోని ఏ మూలలోనైనా ఇది దర్యాప్తు(Investigate) చేస్తుంది. ఇందులో ప్రధానంగా అవినీతి, హత్యలు, కుంభకోణాల కేసుల దర్యాప్తు ఉంటుంది. సీబీఐని 1963లో స్థాపించారు.

CID అంటే...

సీఐడీ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (Crime Investigation Department). బ్రిటీషువారి పాలనా కాలంలో 1902లో దీనిని స్థాపించారు. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక సీఐడీ పోలీసులు(Special CID Police) ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కిడ్నాప్, హత్య, దొంగతనం, అల్లర్లకు సంబంధించిన కేసులను ఇది దర్యాప్తు చేస్తుంది. అంతే కాకుండా హైకోర్టు(High Court) ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కేసును సీఐడీతో విచారణ చేయించాల్సి ఉంటుంది.

రెండింటి మధ్య వ్యత్యాసం

ఈ విభాగాల అధికారుల పనితీరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీబీఐ కార్యక్షేత్రం దేశం మొత్తం మీద ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు, సీబీఐ దేశంలో ఎక్కడైనా దర్యాప్తు చేయవచ్చు. సీఐడీ అనేది రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ(Investigation agency). కాబట్టి అది ఆ రాష్ట్రంలోని కేసులను దర్యాప్తు చేస్తుంది. సీబీఐపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ(control) ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనైనా ఏ కేసునైనా విచారిస్తుంది.

Updated Date - 2023-03-16T10:32:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising