Aadhaar update: ఆధార్ కార్డ్ ఉన్నవారందరికీ కీలక సమాచారం.. జూన్ 14 లోపు ఉచితంగా...
ABN, First Publish Date - 2023-05-30T18:46:41+05:30
ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్‌డేషన్ తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. నిజానికి ఆధార్‌ను అప్‌డేట్ (Aadhar update) చేసుకోవడం ఏమంత కష్టమైన పనికాదు. భారతీయ పౌరులెవరైనా ఆన్‌లైన్‌లో ఈ సర్వీసును పొందొచ్చు.
బ్యాంకింగ్ సర్వీసుల నుంచి ప్రభుత్వ ప్రయోజనాల వరకు దేశవ్యాప్తంగా ఎలాంటి సేవలు పొందేందుకైనా ఆధార్ (Aadhar card) ఎంతో ముఖ్యమైనది. అందుకే.. కీలకమైన ఈ ధృవీకరణ పత్రాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడం ఉత్తమం. ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్‌డేషన్ తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. నిజానికి ఆధార్‌ను అప్‌డేట్ (Aadhar update) చేసుకోవడం ఏమంత కష్టమైన పనికాదు. భారతీయ పౌరులెవరైనా ఆన్‌లైన్‌లో ఈ సర్వీసును పొందొచ్చు.
అయితే సాధారణంగా ఆధార్ అప్‌డేషన్ ప్రక్రియకు ఫీజు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ మాత్రం ఛార్జీ కూడా చెల్లించకుండా అప్‌డేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. యుఐడీఏఐ (UIDAI) అఫీషియల్ పోర్టల్‌పై ఈ పక్రియను పూర్తి చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే జూన్ 14 వరకు మాత్రమే ఈ ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే డెమొగ్రఫిక్ డేటా మాత్రమే అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. అంటే పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం(gender), మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వంటి వివరాలను మాత్రమే ఫీజు లేకుండా అప్‌డేట్ చేసుకునేందుకు వీలుంటుంది. ఫొటో, ఐరిస్ లేదా ఇతర బయోమెట్రిక్ వివరాలు మార్చుకోవాలనుకుంటే మాత్రం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను సందర్శించి.. అవసరమైన ఫీజు చెల్లించి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అసలు ఆధార్ వివరాలు ఎందుకు అప్‌డేట్ చెయ్యాలి..
ఆధార్ అప్‌డేషన్ ఎందుకంత ముఖ్యం?. ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి చేస్తూ ఆధార్ పాలనా విభాగం యుఐడీఏఐ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. పిల్లల ఆధార్ వివరాల అప్‌డేషన్ కోసం ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలను అమలు పరుస్తోంది. పిల్లలకు 15 ఏళ్లు వచ్చేసరికి బయోమెట్రిక్ వివరాలన్నింటిని పొందుపరచాల్సి ఉంటుంది. మరి ఇంతలా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం ఎందుకు చెబుతోందంటే... ఆధార్ సంబంధిత సర్వీసులను మరింత మెరుగుపరచేందుకు వీలుంటుంది. మరోవైపు ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ రేటు కూడా పెరుగుతుంది.
Updated Date - 2023-05-30T18:46:41+05:30 IST