ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health tips: నోటిపుండ్లు వచ్చినప్పుడు తొందరగా తగ్గిపోవాలంటే ఈ 6 పొరపాట్లు అస్సలు చేయకండి..

ABN, First Publish Date - 2023-08-06T18:35:32+05:30

నోటిపుండ్లు చాలామందిని తరచుగా వేధించే సమస్య. నోటిలో ఎర్రగా పుండు ఏర్పడి దాని చుట్టు ప్రాంతమంతా వాపు వచ్చి నోరు మొత్తాన్ని ఇబ్బంది పెడుతుంది. నోటి లోపల, పెదవులమీదా, నోటికి ఇరువైపులా, నాలుక మీద వచ్చే ఈ నోటి పుండ్లు శరీరంలో..

నోటిపుండ్లు చాలామందిని తరచుగా వేధించే సమస్య. నోటిలో ఎర్రగా పుండు ఏర్పడి దాని చుట్టు ప్రాంతమంతా వాపు వచ్చి నోరు మొత్తాన్ని ఇబ్బంది పెడుతుంది. నోటి లోపల, పెదవులమీదా, నోటికి ఇరువైపులా, నాలుక మీద వచ్చే ఈ నోటి పుండ్లు శరీరంలో ఉష్టోగ్రత పెరిగినప్పుడు, మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఇతర సందర్భాలలో వస్తుంటాయి. ఈ సమస్య ఉన్నవాళ్ళు తినడంలోనూ, తాగడంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరైతే నోటి పుండ్లు తగ్గడానికి మెడిసిన్ కూడా వాడుతుంటారు. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే మాత్రం నోటిపుండ్లకు ఏ చికిత్స చేసినా వేస్ట్. నోటిపుండ్లు వచ్చినప్పుడు చేయకూడని 6పొరపాట్లు ఏమిటో తెలుసుకుంటే..

నోటిపుండ్లు (mouth ulcer) వచ్చినప్పుడు చాలామంది కారం, ఉప్పు బాగా తింటే అదే తగ్గుతుందని అనుకుంటారు. అందుకే బాగా కారంగా ఉన్న ఆహారాన్ని(spicy foods) బలవంతం మీద తింటుంటారు. అయితే ఇది చాలా తప్పు. నోటి పుండ్లు ఓపెన్ పుండ్లుగా మారినట్లైతే మసాలా, కారం కలిగిన ఆహారం సమస్యను మరింత పెంచుతుంది. పండుమిర్చి, ఎండుమిర్చి, కారంగా ఉన్న చెట్నీలు, మసాలా కూరలు మొదలైనవాటికి దూరంగా ఉండాలి.

కొందరు కాఫీ, టీ కి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. భోజనం, అల్పాహారం లేకపోయినా భరిస్తారు కానీ కాఫీ, టీ లేకపోతే భరించలేరు. కానీ నోటి పుండ్లు వచ్చినప్పుడు కెఫిన్ పానీయాలు (caffine drinks) తీసుకోకూడదు. కాఫీ, టీ లలో సాలిసైలేట్లు (salicylates) అధికంగా ఉంటుంది. ఇది చిగుళ్లు, నాలుకను చిరాకు పెడుతుంది. నోటి పుండ్లు వచ్చినప్పుడు కెఫిన్ పానీయాలు తీసుకుంటే అది పుండ్లమీద చాలా ప్రభావం చూపిస్తుంది.

ఈ మధ్యకాలంలో మధ్యపానం (alcohol) మగవారికి ఫ్యాషన్ అయిపోయింది. నోటిపూత వచ్చినప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ నోటిని పొడిగా మారుస్తుంది, నోటిలో రక్షణ పొరను దెబ్బతీస్తుంది. ఈ కారణంగా నోటి పుండు నొప్పి, వాపు ఎక్కువ అవుతుంది. అందుకే నోటిపుండ్లు వచ్చినప్పుడు మధ్యపానానికి దూరంగా ఉండాలి.

నోటిపుండు అయినప్పుడు నొప్పికి ఉపశమనం ఉంటుందనే నెపంతో చాలామంది ఐస్ క్రీమ్, శీతలపానీయాలు (cool drinks) తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కార్బోనేటెడ్ పానీయాల్లో ఆమ్లం ఉంటుంది. ఇది నోటిలోని మృదు కణజాలాలను దెబ్బతీస్తుంది. అదనంగా ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది నోటి పుండ్లు పెరగడానికి కారణమవుతుంది.

సిట్రస్ పండ్లు(citrus fruits) అయిన నారింజ, నిమ్మ, ద్రాక్షపండ్లు మొదలైనవాటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల నోటిపూతలను చికాకు పెట్టినట్టు అవుతుంది. ఇవి దురద, తిమ్మిరి వంటి సమస్యలకు లోనవుతాయి. ఫలితంగా ఈ పుండ్లను రెచ్చగొట్టినట్టు అవుతుంది. అందుకే నోటిపూతలు వచ్చినప్పుడు సిట్రస్ పండ్లకు దూరం ఉండాలి.

ఆహారాన్ని వేడిగా లేదా చల్లగా(cool and hot) తీసుకోవడం అందరూ చేసేపనే.. కాఫీ, టీ అసలుకే తాగకూడదంటే ఇక వాటిని కూడా వేడిగానే తాగుతుంటారు. ఇక ఆహారం కూడా వేడిగా ఉన్నట్టే తినడం అందరికీ ఇష్టం. అయితే నోటిపూత ఉన్న సమయంలో అతివేడిగా, అతి చల్లగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.

Updated Date - 2023-08-06T18:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising