Viral Video: మీరు హోటల్‌లో పప్పన్నం తింటారా? ఈ వైరల్ వీడియో చూస్తే ఇకపై భయపడతారేమో..!
ABN, First Publish Date - 2023-11-11T19:46:04+05:30
మీరు తరచుగా హోటల్స్‌కు వెళ్లి భోజనం చేస్తుంటారా? అన్నంలో పప్పు కలుపుకుని తింటుంటారా? ఇంట్లో పప్పన్నం తినడానికి ఇష్టపడని చాలా మంది హోటల్‌కు వెళితే మాత్రం దాని రుచికి ఫిదా అవుతుంటారు. హోటల్స్, రెస్టారెంట్‌లలో వడ్డించే పప్పు రుచి చాలా మందికి నచ్చుతుంటుంది.
మీరు తరచుగా హోటల్స్ (Hotel)కు వెళ్లి భోజనం చేస్తుంటారా? అన్నంలో పప్పు (Dal) కలుపుకుని తింటుంటారా? ఇంట్లో పప్పన్నం తినడానికి ఇష్టపడని చాలా మంది హోటల్‌కు వెళితే మాత్రం దాని రుచికి ఫిదా అవుతుంటారు. హోటల్స్, రెస్టారెంట్‌లలో వడ్డించే పప్పు రుచి చాలా మందికి నచ్చుతుంటుంది. అయితే హోటల్స్‌లో పప్పు ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఢిల్లీ (Delhi)లోని ఓ హోటల్‌లో పప్పు తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా (Viral Video) మారింది.
ziya_vlg అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఢిల్లీలోని ఒక హోటల్‌లో పప్పు తయారు చేసే విధానాన్ని చూపించారు. ఉడకబెట్టి పూర్తిగా గడ్డకట్టి ఉన్న పప్పును ఒక పెద్ద పాత్రలో వేశారు. ఆ తర్వాత దానిలో వేయించిన ఉల్లిపాయలు, గ్రేవీ కలిపారు. తర్వాత ఒక బకెట్‌తో బియ్యం కడిగిన నీళ్ళు పోశారు. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలిపి స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Food and Health).
MS Dhoni: అభిమానికి ధోనీ సూపర్ గిఫ్ట్.. ఫ్యాన్ కారుపై ఆటోగ్రాఫ్.. వైరల్ వీడియోపై నెటిజన్లు రియాక్షన్లు ఏంటంటే..
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వీడియోను వీక్షించారు. 3.2 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. పప్పు తయారు చేసిన విధానంపై చాలా మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ``ఓ గాడ్.. పప్పును ఇలా తయారు చేస్తారా``, ``పరిశుభ్రత అనేది ఎక్కడా కనిపించలేదు``, ``మురికి బియ్యం నీళ్లు అందులో వేశారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-11-11T19:46:05+05:30 IST