ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఒక్క దున్నతో నెలకు రూ.9.60 లక్షల సంపాదన.. అసలు దీని ఖరీదు ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-04-13T16:17:35+05:30

ఇంట్లో పిల్లలు ఏదైనా అడిగితే.. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయేంటిరా అంటుంటారు. ఫ్యామిలీ అన్నాక ఎన్నో ఖర్చులు.. అవసరాలు ఉంటాయి. అవన్నీ తీరాలంటే

Viral News
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంట్లో పిల్లలు ఏదైనా అడిగితే.. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయేంటిరా అంటుంటారు. ఫ్యామిలీ అన్నాక ఎన్నో ఖర్చులు.. అవసరాలు ఉంటాయి. అవన్నీ తీరాలంటే చాలా ధనం అవసరమై ఉంటుంది. మనీ చేతిలో లేనప్పుడు అప్పుడప్పుడూ ఇలాంటి డైలాగ్‌లు ఉపయోగిస్తుంటారు. కానీ ఈ వార్త చదివాక.. ఇలాంటిది ఇంట్లో ఒకటుంటే చాలనుకుంటారు. అదేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

రకరకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని ఉద్యోగాలకు ఒకే జీతం ఉండదు. స్థాయిని బట్టి సాలరీ ఉంటుంది. మా అయితే వేలల్లో ఉంటుంది. ఇక సాప్ట్‌వేర్ ఉద్యోగులకైతే లక్షల్లో ఉంటుంది. కానీ ఓ రైతు సంపాదించే సంపాదన ముందు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా దిగదిడుపే. అతని ఇన్‌కమ్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.

హర్యానా (Haryana)కు చెందిన ఓ రైతు నెలకు రూ.9.60 లక్షల ఆదాయం అర్జిస్తున్నాడు. కేవలం ఒక దున్నపోతు మీద నెలకొచ్చే ఆదాయం ఇదీ. నరేంద్రసింగ్ అనే ఓ రైతు ముర్రాజాతికి చెందిన ఓ దున్నపోతును పెంచుకుంటున్నాడు. దీని ఖరీదు అక్షరాలా రూ.25 కోట్లు. పానీపత్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్రసింగ్ అనే రైతు ఈ మేలురకమైన దున్నపోతును ప్రత్యేకంగా పెంచుకుంటున్నాడు. దీని ముద్దు పేరు ‘షెహన్‌షా’ ‘Bull Shahenshah). వయసు కేవలం పదేళ్లే. పొడువు 15 అడుగులు. ఎత్తు ఆరడుగులు.

ఈ ముర్రాజాతికి (Murrajati plow) చెందిన దున్నల వీర్యానికి ఇండియాలోనే కాకుండా విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. నెలకు నాలుగు సార్లు ఈ దున్నపోతు వీర్యాన్ని బయటకు తీస్తారు. ఆ తర్వాత వీర్యాన్ని 800 డోసులుగా తయారు చేస్తారు. ఇలా వేరే చేసే క్రమంలో ప్రతీ డోసుకు రూ.300 ఖర్చవుతుంది. అనంతరం దీనిని మార్కెట్లో విక్రయిస్తే రూ.9.60 లక్షలు అర్జిస్తున్నాడు (Income per Month). అంటే ఒక సాప్ట్‌వేర్ ఉద్యోగికి కూడా ఇంత ఆదాయం కూడా ఉండదు.

ఈ ముర్రాజతి దున్నలను హరియాణాలో ‘నల్ల బంగారం’ (black gold) అంటారు. ‘షెహన్‌షా’ జీవనశైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాదు దీని యజమాని (Owner) నరేంద్రసింగ్ దీని కోసం ఓ ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్‌ను కట్టించాడు. అంతేకాదు ఇప్పటి వరకూ వివిధ పోటీల్లోనూ విజేతగా నిలిచింది. ఓ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా రూ.30 లక్షల బహుమతి కూడా గెలుచుకుంది.

ఇది కూడా చదవండి: Viral News: బాబోయ్.. ఈ పిల్లాడి పట్టుదల మామూలుగా లేదుగా.. తల్లిపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాడు..!

Updated Date - 2023-04-13T16:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising