First Billionaire: స్వతంత్ర భారతంలో తొలి బిలియనీర్ ఎవరో తెలుసా?.. ముకేష్ అంబానీ, రతన్ టాటా కాదు...
ABN, First Publish Date - 2023-06-12T16:25:59+05:30
భారతీయ బిలియనీర్ల గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా ముకేష్ అంబానీ (Mukesh Ambani), రతన్ టాటా (Ratan Tata), గౌతమ్ అదానీ (Gautham adani), శిశ్ నడార్ (Shiv nadar), లక్ష్మీ మిట్టల్ (Laxmi mittal) వంటి కొన్ని సంపన్నుల పేర్లు ఠక్కున గుర్తొస్తాయి. భారతీయ సంపన్నుల విషయానికి వస్తే ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు సరికొత్త శిఖరాలకు చేరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే మరి స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి భారతీయ బిలియనీర్ ఎవరో తెలుసా?.. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానమే ‘మీర్ ఉస్మాన్ అలీ ఖాన్’ (Mir Osam Ali Khan).
భారతీయ బిలియనీర్ల గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా ముకేష్ అంబానీ (Mukesh Ambani), రతన్ టాటా (Ratan Tata), గౌతమ్ అదానీ (Gautham adani), శిశ్ నడార్ (Shiv nadar), లక్ష్మీ మిట్టల్ (Laxmi mittal) వంటి కొన్ని సంపన్నుల పేర్లు ఠక్కున గుర్తొస్తాయి. భారతీయ సంపన్నుల విషయానికి వస్తే ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు సరికొత్త శిఖరాలకు చేరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే మరి స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి భారతీయ బిలియనీర్ ఎవరో తెలుసా?.. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానమే ‘మీర్ ఉస్మాన్ అలీ ఖాన్’ (Mir Osam Ali Khan). స్వతంత్ర భారతంలో మొట్టమొదటి బిలియనీర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఆనాటి స్వతంత్ర రాజ్యాల్లో ఒకటైన హైదరాబాద్ సంస్థానానికి ఆయన చివరి నిజాంగా కొనసాగారు. బ్రిటిష్ పాలిత ఇండియాలో హైదరాబాద్ సంస్థానం అతిపెద్ద రాజ్యాల్లో ఒకటిగా ఉండేది. దీనిని 1911 నుంచి 1948 వరకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలించారు. ఈయన బ్రిటిష్‌వారికి విధేయుడిగా ఉండేవారు. దేశ విభజన సమయంలో అయితే పాకిస్తాన్‌లో కలవడం లేదా స్వతంత్రంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
1940ల్లోనే సంపన్నుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు...
మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఆ రోజుల్లోనే గుర్తింపుపొందారు. 1940 దశకంలో ఆయన సంపద విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇక 2023లో దీని విలువ 35.8 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనాగా ఉంది. ఆధునిక హైదరాబాద్‌కు నిర్మాతగా పేరున్న మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లో తొలి ప్రైవేటు ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్‌ను కలిగివున్నారు. ఆయన పాలనలో హైదరాబాద్‌లో రోడ్లు, రైల్వే అభివృద్ధి జరిగాయి. అంతేకాదు ఆయన పాలనలో హైదరాబాద్‌కు విద్యుత్ వెలుగులు వచ్చాయి. హైదరాబాద్ హైకోర్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లను నెలకొల్పింది కూడా ఆయనే.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన జీవితంలో ఉన్నతస్థితిలో ఉన్న సమయం 1937లో ‘టైమ్ మ్యాగజైన్’ కవర్ పేజీతో స్టోరీ ఇచ్చింది. మరిన్ని రిపోర్టుల ప్రకారం ఆయన 185 క్యారట్ల డైమండ్, జాకబ్ డైమండ్‌లను ఉపయోగించారు. క్వీన్ ఎలిజిబెట్-2 పెళ్లి సందర్భంగా డైమండ్ నెక్లెస్, ఆభరణాలను బహుమతిగా ఇచ్చారు. వాటిని క్వీన్ ఎలిజిబెత్-2 చనిపోయే ముందు వరకు వీటిని ధరించారని రిపోర్టులు చెబుతున్నాయి.
Updated Date - 2023-06-12T16:25:59+05:30 IST