ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ స్వీట్ పేరేంటో తెలుసా? దీపావళికి ఈ స్వీట్ చేసుకుని తింటే.. నెటిజన్లు రియాక్షన్లు ఏంటంటే..

ABN, First Publish Date - 2023-11-05T19:15:33+05:30

మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ రాబోతోంది. ఈ వెలుగుల పండగ రోజు ప్రతి ఒక్కరూ తీపి వంటకాలు తినేందుకు ఇష్టపడతారు. టపాసులు కాల్చే ముందు స్వీట్ తింటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను కొత్త కొత్త స్వీట్ల వీడియోలు ముంచెత్తుతున్నాయి.

మరికొద్ది రోజుల్లో దీపావళి (Diwali) పండుగ రాబోతోంది. ఈ వెలుగుల పండగ రోజు ప్రతి ఒక్కరూ తీపి వంటకాలు (Sweets) తినేందుకు ఇష్టపడతారు. టపాసులు కాల్చే ముందు స్వీట్ తింటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను కొత్త కొత్త స్వీట్ల వీడియోలు (Food Videos) ముంచెత్తుతున్నాయి. గులాబ్ జాబ్, జిలేబీ వంటి స్వీట్లను తయారు చేసే వీడియోలు మాత్రమే కాదు.. ఎప్పుడూ వినని కొత్త స్వీట్ల తయారీ విధానాలు కూడా కళ్ల ముందుకు వస్తున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) గోవాకు (Goa Sweet) చెందిన ఒక ప్రసిద్ధ స్వీట్ తయారీ విధానం చూపించారు. ఈ స్వీట్‌ను తయారు చేసే పద్ధతి కూడా చాలా ప్రత్యేకమైనది. wanderlust_foodies_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. గోవాకు చెందిన ఈ స్పెషల్ స్వీట్ డిష్‌ను తయారుచేసే ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చూపించారు. ఈ స్వీట్‌ను జీరో ఆయిల్, జీరో షుగర్‌తో తయారు చేశారు. పనస ఆకులను శంఖు ఆకారంలో ఉంచి, దానిలో కొబ్బరి, బెల్లం నింపి, దానిని ఉంచారు. దాని పైన బియ్యం పేస్ట్‌తో మూత వేశారు.

Geyser: చలికాలంలో వేడినీళ్ల కోసం గీజర్ వాడుతున్నారా? ఇలాంటి తప్పులు చెయ్యొద్దు.. ఓ యువతి చెప్పిన జాగ్రత్తలు ఏంటంటే..

దానిని 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే స్వీట్ సిద్ధం అయిపోయింది. ఈ స్వీట్‌ను గోన్ స్వీట్ (Goan Sweet) అంటారు. ఈ వైరల్ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 1.47 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఈ స్వీట్ గోవాలో ఎక్కడ దొరుకుతుంది``, ``ఈ స్వీట్ టేస్ట్ అమోఘం``, ``క్యాలరీల గురించి చింత లేకండా తినొచ్చు``, ``ఈ దీపావళికి ఈ స్వీట్ తయారు చేస్తా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-05T19:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising