Noodles Video: నూడుల్స్ అంటే తెగ ఇష్టమా..? అసలు వీటిని ఎలా తయారు చేస్తున్నారో చూస్తే తినడం మానేస్తారేమో..!
ABN, First Publish Date - 2023-10-17T18:45:34+05:30
స్ట్రీట్ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడేవారు వీలైనంత తరచుగా నూడిల్స్ తింటుంటారు. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ వంటి కూరగాయలతో చేసిన నూడుల్స్ తినడం చాలా మందికి ఇష్టం. వెజ్, నాన్-వెజ్ రకాల్లో లభించే ఈ చైనీస్ వంటకానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
స్ట్రీట్ ఫుడ్‌ను (Street Food) ఎక్కువగా ఇష్టపడేవారు వీలైనంత తరచుగా నూడిల్స్ (Noodles) తింటుంటారు. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ వంటి కూరగాయలతో చేసిన నూడుల్స్ తినడం చాలా మందికి ఇష్టం. వెజ్, నాన్-వెజ్ రకాల్లో లభించే ఈ చైనీస్ వంటకానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ నూడిల్స్ తయారయ్యే ప్రక్రియ మాత్రం చాలా అనారోగ్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Noodles Video) చూస్తే ఇకపై నూడిల్స్ తినడానికే భయపడతారేమో.
కోల్‌కతా (Kolkata)లోని ఒక ఫ్యాక్టరీలో నూడుల్స్ తయారు చేసే ప్రక్రియకు సంబంధించిన ఓ వీడియో (Noodles Making Video) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నూడుల్స్‌ను తయారు చేస్తున్న విధానం వీడియోలో కనిపిస్తోంది. నూడుల్స్ ప్రాసెస్ చేసేటప్పుడు కార్మికులు గ్లౌజులు కూడా ధరించలేదు. కనీస శుభ్రత లేకుండా నూడిల్స్‌ను తయారు చేస్తున్న వైనం చాలా మందికి విస్మయం కలిగిస్తోంది. అపరిశుభ్రమైన యంత్రాలను ఉపయోగించి నూడిల్స్ తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన నూడిల్స్‌ను నేల మీదే వేసేస్తున్నారు (Food and Health).
Funny Video: ఈ టెక్నిక్ తెలియక ఎంత సేపు వెయిట్ చేస్తాం.. ఓ వ్యక్తి రోడ్డు దాటడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించాడో చూడండి..
hmm_nikhil అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వైరల్ వీడియోను 32 లక్షల మందికి పైగా వీక్షించారు. 53 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ``దేవుడా.. ఇకపై నూడిల్స్ తినలేను``, ``నాన్-బ్రాండెడ్ నూడిల్స్ తినకపోవడమే మంచిది``, ``మనం తినే ఏ ఫాస్ట్ ఫుడ్ అయినా ఇలాగే తయారవుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-10-17T18:45:34+05:30 IST