ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Doctor Tweet: మూడు లడ్డూల ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఓ పేషెంట్ గురించి దారుణ నిజాలు చెప్పాడో డాక్టర్.. నాలుగో లడ్డూ ఏమైందంటూ.. !

ABN, First Publish Date - 2023-05-03T14:12:40+05:30

ఓ వైద్యుడి హృద్యమైన పోస్ట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ వైద్యుడి హృద్యమైన పోస్ట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మద్యానికి బానిసైన ఓ పేషెంట్‌కు చికిత్స అందించిన వైద్యుడు.. ఆ రోగి కుటుంబం తనకు ఇచ్చిన మూడు లడ్డూల ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. వాటి వెనుక ఉన్న హృదయాన్ని కలిచివేసే కథ చెప్పారాయన. ప్రస్తుత సమాజంలో మద్యం పలు కుటుంబాలలో ఎంతటి దారుణ పరిస్థితులను మిగిలిస్తుందో కూలంకషంగా వివరించారు డాక్టర్. ఈ పోస్టుపై నెటిజన్లు సైతం ఈ స్టోరీ చాలా పెయినింగ్‌గా ఉందని.. కన్నీళ్లు వస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.

డా. ఫిలిప్స్ (@theliverdr) తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ పోస్ట్ చేశారు. "నాల్గో లడ్డూ ఎక్కడ. ఈ మూడు లడ్డూలు నా వద్ద చికిత్స పొందిన రోగి భార్య తన బర్త్‌డే సందర్భంగా ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సంతోషంగా ఉంది. ఆమె కుటుంబం కూడా హ్యపీ" అంటూ తన వద్ద ట్రీట్‌మెంట్ పొందిన ఓ పెషేంట్ తాలూకు పెయిన్‌ఫుల్ స్టోరీ చెప్పారాయన. రోగి పేరు పాల్. అతడు మద్యానికి బానిసయ్యాడు. చిన్న బేకరీ షాపు నడిపించే పాల్.. 15 ఏళ్ల నుంచి మద్యం సేవిస్తున్నాడు. షాపు ద్వారా వచ్చే డబ్బులు మొత్తం ఇలా మద్యానికే తగిలేసేవాడు. భార్య మొదట్లో బయట చిన్న బాబ్ చేసేది. కానీ, ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత నుంచి మానేసింది. ఇక పాల్ మద్యం వ్యసనం ఆ కుటుంబంలో కలతలు రేపింది. అతగాడు ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులను చూపిస్తే.. లీవర్ దెబ్బతింది.. వెంటనే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి అన్నారు. కానీ, అప్పటికే వారికి పూటగడవడం కూడా గండంగా మారింది. దాంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో పాల్‌ను ఆమె భార్య డాక్టర్ ఫిలిప్స్ వద్దకు తీసుకువచ్చింది. ఆమె పరిస్థితి తెలుసుకుని పాల్‌కు ఉచితంగానే వైద్యం అందించడం మొదలెట్టారు. కానీ, అప్పటికే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చికిత్స మొదలెట్టిన 18వ రోజు పాల్ చనిపోయాడు.

Uber Driver: హ్మ్.. నీకు ఇంగ్లీషు కూడా వచ్చా..? ఏం చదువుకున్నావేంటని డ్రైవింగ్ చేస్తున్న యువతిని అడిగిన కస్టమర్.. ఆమె చెప్పింది విని..


ఇది జరిగిన మూడు నెలల తర్వాత అతడి భార్య తన పుట్టిన రోజు సందర్భంగా డాక్టర్ వద్ద మూడు లడ్డూలు తీసుకుని వెళ్లింది. అవి ఫిలిప్స్‌కు ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఎలా ఉన్నారు? అడిగారట. తాను ప్రస్తుతం సంతోషంగానే ఉన్నానని, తన ఇద్దరూ కూతుళ్లు స్కూల్‌కు వెళ్తున్నట్లు చెప్పిందట. అలాగే బేకరీ షాపును తానే నిర్వహిస్తున్నట్లు తెలియజేసిందని వైద్యుడు చెప్పుకొచ్చారు. అలా ఆమె ఇచ్చిన మూడు లడ్డూలు వారి కుటుంబంలోని ముగ్గురికి చెందినవని, నాల్గో లడ్డూ మిస్‌ అయిందంటూ పాల్ మరణాన్ని హృద్యంగా ప్రస్తావించారు. మద్యం వ్యసనం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేయడం తాను చూస్తున్నానని, సాధ్యమైనంతవరకు దానికి దూరంగా ఉండాలని డా. ఫిలిప్స్ చెప్పుకొచ్చారు. అలాగే మద్యం వల్ల కలిగే అనర్థాలను అందరికీ తెలిసేలా పాల్ స్టోరీని మీకు తెలిసిన భాషల్లో పోస్ట్ చేయండంటూ ఆయన కోరారు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

Viral News: జీవితంలో అసలు పెళ్లే చేసుకోదట.. కానీ ఓ బిడ్డకు తల్లి అవాలని మాత్రం ఉందట.. చివరకు ఈ యువతి ఏం చేసిందంటే..!

"ఇది హృదయానికి హత్తుకునేలా ఉంది. ఇలాంటి విషయాలు అందరికీ అర్థం అయ్యేలా చేసినందుకు ధన్యవాదాలు. మద్యం సమాజానికి ఓ శాపం. మీ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా తెలియాలి" అని ఒకరు, "వీలైతే హిందీలో చెప్పండి. ఇది చాలా మంది చదవాలి. చాలా మందికి ఇంగ్లీష్ అర్థం కాదు" అని మరోకరు, "అద్భుతంగా చెప్పారు. మీ బాధను నాకు అర్థమవుతుంది. మీ హృదయంలో ఎంత బాధ కలిగి ఉంటే.. ఇలా రాయడం అంత సులభం కాదు. అభినందనలు." అని ఇంకోకరు, "డాక్టర్, మీరు మంచి వ్యక్తి. మీ ఈ పోరాటాన్ని కొనసాగించండి. మంచి చేయండి. మీలాంటి వ్యక్తులు వ్యవస్థకు వ్యతిరేకంగా తమ గొంతును వినిపంచడానికి సిద్ధంగా ఉండేవారు మాకు చాలా అరుదుగా కనిపిస్తారు" అని నెటిజన్ కామెంట్ చేశారు.

Crime News: ఆ తల్లి చేసిన పొరపాటే.. 11 ఏళ్ల కూతురి పాలిటి శాపమయింది.. 40 ఏళ్ల వ్యక్తితో ఆ బాలిక పెళ్లి జరగడం వెనుక..!

Updated Date - 2023-05-03T14:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising