ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 ఏళ్ల బాలికకు తరచూ వాంతులు.. బక్కగా అయిపోతోందంటూ ఆస్పత్రికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు.. టెస్టులు చేసి అవాక్కైన డాక్టర్లు..

ABN, First Publish Date - 2023-02-01T15:26:54+05:30

ఇదో విచిత్రమైన సీన్. 16 ఏళ్ల బాలిక. వాంతులు అవుతున్నాయంటూ ఆస్పత్రికొచ్చింది. ఆమె బాధను చూడలేక డాక్టర్లు స్కానింగ్ చేశారు. స్క్రీన్‌లో చూసిన ఆ దృశ్యంతో డాక్టర్లు అవాక్కయ్యారు. ఇంతకీ ఏమైంది? వైద్యులు షాకయ్యే

కడుపులో ఉన్న సీన్ చూసి..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇదో విచిత్రమైన సీన్. 16 ఏళ్ల బాలిక. వాంతులు అవుతున్నాయంటూ ఆస్పత్రికొచ్చింది. ఆమె బాధను చూడలేక డాక్టర్లు స్కానింగ్ చేశారు. స్క్రీన్‌లో చూసిన ఆ దృశ్యంతో డాక్టర్లు అవాక్కయ్యారు. ఇంతకీ ఏమైంది? వైద్యులు షాకయ్యే ఆ సంఘటన ఏంటి? ఈ విషయాలు తెలియాలంటే.. ఈ వార్త చదవాల్సిందే.

కృష్ణా జిల్లా గుడివాడ (Gudivada)లో ఓ వింతైన సంఘటన దర్శనమిచ్చింది. ఏలూరు రోడ్డులోని శ్రీరామా నర్సింగ్‌ హోమ్‌ (Nursing home)కు ఓ పదహారేళ్ల బాలిక (girl) వచ్చింది. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు చేసుకుంటూ ఆస్పత్రికి వచ్చింది. బాలికను ప్రాథమికంగా పరిశీలించిన వైద్యులు స్కానింగ్‌కు రిఫర్ చేశారు. టెస్టింగ్ రూమ్‌ (Medical test room)లో బాలికను పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎండోస్కోప్ (Endoscope) ద్వారా పరిశీలించిన డాక్టర్లు.. కడుపులో ఉన్న సీన్ చూసి అవాక్కయ్యారు. పలు టెస్ట్‌లు చేసిన అనంతరం కడుపులో భారీగా తలవెంట్రుకల గుట్ట ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో బాలికకు శస్త్ర చికిత్స (Surgery) చేసి కిలోకు పైగా వెంట్రుకల (hair)ను తొలగించారు.

ఇది కూడా చదవండి: టెన్త్ ఉత్తీర్ణతతో తపాల శాఖలో పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..!

బాలిక (girl) ట్రైకోబీజోర్‌ సమస్యతో బాధపడుతుందని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. పదేళ్లుగా జుట్టు తినడం అలవాటుగా మార్చుకుందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసి వెంట్రుకలన్నీ తొలగించినట్లు వివరించారు. ప్రస్తుతం బాలిక సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని వెల్లడించారు. రక్తహీనత (anemia) వల్లే ఈ సమస్య ఎదురైందన్నారు. లక్షల్లో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి లక్షణాలుంటాయని చెప్పుకొచ్చారు. రక్తహీనత వల్ల చిన్నతనంలోనే బాలిక వెంట్రుకలను తినడం అలవాటు చేసుకుందన్నారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్డర్ శివప్రసాద్, సిబ్బంది సాంబశివరావు, శివాజీ, అజయ్, నవీన్, శాంతకుమారి కూడా పాల్గొన్నారని వంశీకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-02T10:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising