ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: స్నేహితుడి కోసం ఆ కుక్క ఎలా విలవిలలాడిందో.. సహాయం చేయమని ఎలా అడుగుతోందో చూడండి..

ABN, First Publish Date - 2023-07-04T11:22:06+05:30

మనం ప్రతిరోజూ కలిసి తిరిగే స్నేహితుడు లేదా మన సహచరుడు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే మనం తీవ్రంగా విలవిలలాడతాం. వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాం. అవసరమైతే ఇతరుల సహాయాన్ని కూడా అర్థిస్తాం. మనుషులే కాదు.. కుక్కలు కూడా ఇలాగే ప్రవర్తిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం ప్రతిరోజూ కలిసి తిరిగే స్నేహితుడు లేదా మన సహచరుడు (Friend) ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే మనం తీవ్రంగా విలవిలలాడతాం. వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాం. అవసరమైతే ఇతరుల సహాయాన్ని కూడా అర్థిస్తాం. మనుషులే కాదు.. కుక్కలు (Dogs) కూడా ఇలాగే ప్రవర్తిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ వీడియోలో (Dog Videos) ఓ కుక్క తన సహచర కుక్కను కాపాడేందుకు ఎంతగానో తపన పడింది.

@Yoda4ever అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండు కుక్కలు సరదాగా ఆడుకుంటున్నాయి. అటూ ఇటూ పరిగెడుతున్నాయి. ఇంతలో ఓ కుక్క గోడ పక్కన ఉన్న స్లంపులో పడిపోయింది. బయటకు రాలేక అందులోనే ఉండిపోయింది. దీంతో రెండో కుక్కకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని అటూ ఇటూ తిరిగింది. అంతలో ఓ వ్యక్తి అటువైపు వెళ్తున్నాడు. తన స్నేహితుడికి సహాయం చేయమని కుక్క అతడి చుట్టూ తిరిగింది. ముందు ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు (Dog seeks help from man).

Digital Beggar: టెక్నాలజీ వాడుకుంటున్న బిచ్చగాడు.. చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన.. వీడియో వైరల్!

ఆ తర్వాత స్లంపులో నుంచి కుక్క అరుపులు విని అసలు విషయం అర్థం చేసుకున్నాడు. వెంటనే అందులోకి దిగి లోపల ఉన్న కుక్కను బయటకు తీశాడు. దీంతో ఆ రెండు కుక్కలు ఆ వ్యక్తికి కృతజ్ఞత తెలియజేస్తూ అతడి చుట్టూ తిరిగాయి. ఆ తర్వాత సంతోషంగా ఆడుకున్నాయి. ఈ వీడియో (Emotional Video) సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను దాదాపు 1.70 కోట్ల మంది వీక్షించారు. వీడియో చాలా టచింగ్‌గా ఉందని చాలా మంది కామెంట్లు చేశారు.

Updated Date - 2023-07-04T11:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising