ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dominos e-Bike: డోమినోస్ పిజ్జా సంచలన ఆవిష్కరణ.. ఇకపై చల్లటి పిజ్జాలకు చెల్లు

ABN, First Publish Date - 2023-11-23T15:10:04+05:30

డోమినోస్ ఈ - బైక్(Dominos e-Bike) తీసుకొచ్చింది. డెలివరీ చేస్తున్న పిజ్జాలను గమ్యానికి చేర్చే వరకు హాట్ గా ఉంచడమే ఈ - బైక్స్ స్పెషాలిటీ. ఈ బైక్ లలో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది. దీంతో కస్టమర్లకు వేడి వేడి పిజ్జాలు డెలివరీ చేయవచ్చని డోమినోస్ సంస్థ అధికారులు చెబుతున్నారు.

న్యూయార్క్: ఉరుకుల పరుగుల జీవితంలో వండుకోవడానికి కూడా కొన్ని సార్లు టైం ఉండదు. అలాంటి వారికి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలు(Food Deliveries) బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఉద్యోగార్థులు, ప్రజల సమయాన్ని ఇవి బాగా ఆదా చేస్తున్నాయి.

అయితే విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా ఫుడ్ కాస్తా చల్లారిపోవడం ఆర్డర్ చేసినవారిని సంతృప్తి పరచలేకపోతోంది. దీంతో ఆహారాన్ని వేడి సర్వ్ చేయడం కంపెనీలకు పెద్ద టాస్క్ గా మారింది. ఈ సమస్య వరల్ట్ ఫేమస్ పిజ్జాలు తయారు చేసే డోమినోస్(Dominos) సంస్థకు కూడా వచ్చింది. దానికి పరిష్కారమార్గంగా కనిపెట్టిన ఓ వస్తువు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


డోమినోస్ తో పోటీ పడుతున్న స్విగ్గీ, జొమాటోలను తట్టుకోవాలంటే మార్కెట్లో ప్రజల మద్దతు పొందాలి. ఇందుకోసమే డోమినోస్ ఈ - బైక్(Dominos e-Bike) తీసుకొచ్చింది. డెలివరీ చేస్తున్న పిజ్జాలను గమ్యానికి చేర్చే వరకు హాట్ గా ఉంచడమే ఈ - బైక్స్ స్పెషాలిటీ. ఈ బైక్ లలో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది. దీంతో కస్టమర్లకు వేడి వేడి పిజ్జాలు డెలివరీ చేయవచ్చని డోమినోస్ సంస్థ అధికారులు చెబుతున్నారు.

పిజ్జా పాడ్‌కు దిగువన ఉన్న షాక్ అబ్జార్బర్‌లు దానిని సున్నితంగా, స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి పిజ్జా అతుక్కుపోకుండా ఈజీగా తీసేలా ఉంటుంది. అదనంగా, ఇంటిగ్రేటెడ్ వెంటిలేషన్ సిస్టమ్ ఆవిరిని తప్పించి.. పిజ్జా తడిగా ఉండకుండా చేస్తుంది. డోమినోస్ పిజ్జా ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ విడుదల చేసిన ఈ - బైక్ తో ఫుడ్ ని వేగంగా, సులభంగా డెలివరీ చేయొచ్చు.

బైక్ "పిజ్జా పాడ్" టాపింగ్స్ చెక్కుచెదరకుండా ఉండేలా.. వేడిగా ఉంచేలా చూస్తుంది. తాజాదనం, చీజ్ స్ట్రెచ్ కోసం పిజ్జాను 68 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో ఉంచుతుంది. ఈ బైక్ అందుబాటులోకి వచ్చే వివరాలు కంపెనీ ప్రతినిధులు ఇంకా ప్రకటించలేదు. తొలుత జపాన్, జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో దీన్ని విడుదల చేయడానికి సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-23T15:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising