ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Credit Card: క్రెడిట్ కార్డు ఉందా..? అయితే ఈ మిస్టేక్ మాత్రం పొరపాటున కూడా చేయకండి..!

ABN, First Publish Date - 2023-08-16T15:31:07+05:30

మీకు క్రెడిట్ కార్డు ఉందా? ప్రతి నెలా ఆ కార్డును ఉపయోగిస్తుంటారా? మీ క్రెడిట్ పరిమితికి సమానంగా మీరు షాపింగ్ చేస్తుంటారా? అయితే ఓ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు చాలా నష్టాలను భరించాల్సి రావచ్చు.

మీకు క్రెడిట్ కార్డు (Credit Card) ఉందా? ప్రతి నెలా ఆ కార్డును ఉపయోగిస్తుంటారా? మీ క్రెడిట్ పరిమితి (Credit Limit)కి సమానంగా మీరు షాపింగ్ చేస్తుంటారా? అయితే ఓ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు చాలా నష్టాలను భరించాల్సి రావచ్చు. క్రెడిట్ కార్డు ఉపయోగించడం వల్ల కొన్ని లాభాలున్నప్పటికీ సరైన విధానంలో దానిని ఉపయోగించకపోతే అనవసర అర్థిక సమస్యలు తలెత్తుతాయి. ప్రతి నెల క్రెడిట్ కార్డు లిమిట్ పూర్తిగా ఉపయోగిస్తున్నట్టైతే కొన్ని నష్టాలు తప్పవు (Viral News).

మీ క్రెడిట్ స్కోర్ (Credit Score) బాగా ఉండాలంటే CUR (క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో)ను సరిగ్గా నిర్వహించాలి. అంటే మీరు ప్రతి నెల క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగిస్తున్నారో ఈ CUR తెలియజేస్తుంది. మంచి క్రెడిట్ స్కోరు కావాలంటే CUR ప్రతి నెల 30 శాతానికి తక్కువగానే ఉండాలి. అధిక CUR అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అర్థం . ఏదైనా లోన్ (Bank Loan) కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాతలు మీ CURని తనిఖీ చేస్తారు. CUR తక్కువగా ఉంటే మీరు లోన్ పొందడం సులభమవుతుంది.

Petrol Price: అర్ధరాత్రి దేశ పౌరులకు సడన్ షాకిచ్చిన పాకిస్తాన్.. ఇప్పుడా దేశంలో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలిస్తే..!

CUR తక్కువగా ఉండాలంటే మీ క్రెడిట్ కార్డు లిమిట్‌లో కేవలం 30 శాతం మాత్రమే మీరు ఖర్చు పెట్టాలి. మీరు తక్కువ CURని మెయింటెయిన్ చేస్తున్నట్లయితే ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డ్‌పై క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ పెరిగినట్టైతే ఆటోమేటిక్‌గా CURని తగ్గిస్తుంది. క్రెడిట్ స్కోరును పెంచుతుంది. కాబట్టి ప్రతినెలా పరిమిత మొత్తంలో మాత్రమే క్రెడిట్ కార్డు ఉపయోగించి చెల్లింపులు చేయాలి.

Updated Date - 2023-08-16T15:31:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising