ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drinking Water: రోజూ పరగడపున నీళ్లు తాగితే మంచిదేనంటూ.. అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. ఆయుర్వేదంలో ఏముందంటే..!

ABN, First Publish Date - 2023-07-06T17:08:56+05:30

పరగడపున మంచినీరు తాగే అలవాటు మంచిదే అయినా తమకు తెలియకుండానే అందరూ పెద్ద పొరపాటు చేస్తున్నారు. అందుకే ఇంత మంచి అలవాటున్నా ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం లేగదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీరు శరీరానికి గొప్ప ఔషదం. శరీరానికి సరిపడినంత శుభ్రమైన నీటిని తాగితే ఎన్నో జబ్బులు ఆమడదూరంలోనే ఆగిపోతాయి. చాలామంది ఉదయాన్నే పరగడపున మంచినీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నమ్ముతారు. నిజానికి ఈ అలవాటు మంచిదే అయినా తమకు తెలియకుండానే పెద్ద పొరపాటు చేస్తున్నారు. మంచినీరు తాగే విషయంలో ఆయుర్వేదం కొన్ని నియమాలు విధించింది. ముఖ్యంగా ఉదయాన్నే తాగే నీటి గురించి తెలిస్తే అందరూ ఎంత పొరపాటు చేస్తున్నారో అర్థమవుతుంది. ఉదయాన్నే నీరు త్రాగడంలో చేస్తున్న పొరపాట్లు తెలుసుకుంటే..

వాహనానికి ఇంధనం ఎంత అవసరమో శరీరానికి నీరు కూడా అంతే అవసరం. చాలామంది ఆరోగ్యానికి మంచిదని పరగడపున నీరు త్రాగుతుంటారు(Early morning water). ఇలా ఉదయాన్నే నీరు త్రాగడాన్ని ఆయుర్వేదంలో 'ఉషాపానం' అని అంటారు. ఉదయాన్నే సుమారు 640మి.లీ గోరువెచ్చని నీటిని(అరలీటర్ పైగా)(640ml warm water) బ్రహ్మ ముహూర్తంలో తాగాలని ఆయుర్వేదం చెప్పింది. అంటే సూర్యుడు ఉదయించకమునుపే(warm eater drink before sunrising), లేదా 6గంటలలోపే ఈ నీటిని తాగాలి. ఇలా చేస్తేనే ఉదయాన్నే తాగే నీటివల్ల చక్కని ఫలితాలుంటాయి. కానీ ఇప్పట్లో చాలామంది 6నుండి 10గంటల లోపు నిద్రలేస్తుంటారు. ఆ తరువాత నిర్లక్ష్యంగా కాలకృత్యాలు తీర్చుకుని వేడినీటిని తాగుతారు. దీనివల్ల ఎలాంటి ఫలితం ఉందడదు. ఇంకా చెప్పాలంటే ఉదయం 8నుండి 10గంటల మధ్య నీరు త్రాగితే అది 'కఫా పానం'గా పిలువబడుతుంది. ఈ సమయంలో తాగిన నీరు జీర్ణం కావడం కష్టతరమవుతుంది. కాబట్టి ఉదయాన్నే 6గంటల లోపు 640మి.లీ గోరువెచ్చని నీరు త్రాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

Wife-Husband: బాబోయ్.. ఇదెక్కడి యవ్వారం.. భర్త బాత్రూంలోకి వెళ్లినా ఆ భార్యకు డౌటే.. ఏం చేయాలని అతడు అడిగితే..!


ఉదయాన్నే తాగే నీరు శరీరానికి ఒంటకపోతే అది సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అందులో భాగమే కడుపు ఉబ్బరంగా(stomach bloating) ఉండటం, పొత్తి కడుపు నొప్పిగా(abdominal pain) ఉండటం, కడుపులో గ్యాస్(gas problem) ఏర్పడటం. అన్నిటికీ మించి కడుపులో ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ కారణంగా పుల్ల త్రేన్పులు, కడుపు మంట, ఏమీ తినాలని అనిపించకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. ఇవన్నీ నీరు అరగకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు. ఈ సమస్యలు అరికట్టాలంటే.. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. గోరు వెచ్చని నీటిని ఒక్కసారిగా కాకుండా చిన్న చిన్నగ్లాసులలో తాగాలి. నీటిని ఎప్పుడూ ఎత్తుకుని తాగకూడదు. ఆరోగ్యానికి మంచిదని నీటిని ఎడాపెడా తాగి, ఆ తరువాత ఒకే చోట కూర్చుని పనిచేయకూడదు. ఎంత నీరు త్రాగితే అంత శారీరక శ్రమ చెయ్యాలి.

Pani Puri: పానీ పూరీ తినే అలవాటుందా..? ఒక్కసారి ఇది చూడండంటూ నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!


Updated Date - 2023-07-06T17:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising