Viral Video: నీ మాటలు నిజమే బాసూ.. అంటూ ఆటో డ్రైవర్‌కు అనూహ్య మద్ధతు.. ఇంతకీ ఆటో వెనుక అతడు ఏం రాశాడంటే..

ABN, First Publish Date - 2023-04-19T11:05:22+05:30

బయట రోడ్లపై వెళ్తున్నప్పుడు మనకు ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు, ట్రక్కుల వెనుక వైపు చాలాసార్లు ఏవో సామెతలు, కవితలు కనిపిస్తుంటాయి.

Viral Video: నీ మాటలు నిజమే బాసూ.. అంటూ ఆటో డ్రైవర్‌కు అనూహ్య మద్ధతు.. ఇంతకీ ఆటో వెనుక అతడు ఏం రాశాడంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: బయట రోడ్లపై వెళ్తున్నప్పుడు మనకు ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు, ట్రక్కుల వెనుక వైపు చాలాసార్లు ఏవో సామెతలు, కవితలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని నవ్వును తెప్పిస్తే, మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. అలాగే ఇంకొన్నింటినీ చూస్తే.. అరేరే ఆ డ్రైవర్ తన వాహనంపై రాసుకుంది నిజమేగా అని అనిపిస్తుంది. ఇలాంటి ఓ కొటేషన్‌తో (Quotation) కూడిన ఒక ఆటో తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ కోట్ చదివిన నెటిజన్లు 'నీ మాటలు నిజమే బాసూ..' అంటూ ఆటో డ్రైవర్‌కు అనూహ్య మద్ధతు తెలుపుతున్నారు. ఇంతకీ ఆటో వెనుక అతడు ఏం రాశాడో తెలుసా? 'మన అనేవాళ్లతో జాగ్రత్త'(Apno Se Savdhan) అని రాసిపెట్టాడు.

@BabaJogeshwari. అనే ట్విటర్ హ్యాండిల్ ద్వారా జినా ఖోల్కార్ అనే యూజర్ 'ఫ్రైడే' (Friday) అనే క్యాప్షన్‌తో ఈ నెల 14వ తేదీన ఈ వీడియోను పోస్ట్ చేశారు. అంతే.. వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఆ ఆటో వెనుకవైపు ఉన్న కోటేషన్ చదివిన నెటిజన్లు 'నీ మాటలు నిజమే బాసూ..' అంటూ ఆటో డ్రైవర్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 20వేల వరకు వ్యూస్ వచ్చాయి. సుమారు వెయ్యి వరకు లైక్స్ వచ్చి పడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తూ.. 'ఇది నిజంగా నిజం' అని ఒకరు, 'ఇది శ్రీకృష్ణావతారం కార్' అని మరోకరు, 'మంచి ప్రవర్తనతో కూడిన వారు కూడా ఎప్పుడు డబ్బు అడుగుతారో ఎవరికి తెలుసు' అని ఇంకోకరు కామెంట్ చేశారు. మరి ఈ కొటేషన్‌పై మీరేమంటారు..?

Viral Video: రైల్లో ఓ వృద్ధ జంట ప్రయాణం.. భర్త చేసిన పనిని దూరం నుంచి సీక్రెట్‌గా వీడియో తీశాడో ప్రయాణీకుడు.. నెట్టింట పోస్ట్ చేస్తే..

Shalini Pandey: ఓ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోస్తోన్న ‘అర్జున్ రెడ్డి’ భామ.. చూస్తే మతిపోవాల్సిందే..!

Shriya Saran: వామ్మో.. శ్రియ అందాలు చూస్తే.. పడిపోవాల్సిందే..!

Updated Date - 2023-04-19T13:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising