Viral Video: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఏకంగా 19 మంది ప్రయాణీకులను విమానంలోంచి దించేయడం వెనుక..!
ABN, First Publish Date - 2023-07-10T15:07:54+05:30
విమాన ప్రయాణం చాలా వేగంగా, సౌకర్యవంతంగా ఉంటుందనే మాట ఎంత నిజమో ఏదైనా తేడా వస్తే అంతే భయంకరంగా ఉంటుందనేది కూడా అంతే నిజం. ఇటీవలి కాలంలో తరచుగా విమాన ప్రయాణికులు చాలా అసహనానికి గురవుతున్న ఘటనలు బయటకు వస్తున్నాయి.
విమాన ప్రయాణం (Flight Journey) చాలా వేగంగా, సౌకర్యవంతంగా ఉంటుందనే మాట ఎంత నిజమో ఏదైనా తేడా వస్తే అంతే భయంకరంగా ఉంటుందనేది కూడా అంతే నిజం. ఇటీవలి కాలంలో తరచుగా విమాన ప్రయాణికులు చాలా అసహనానికి గురవుతున్న ఘటనలు బయటకు వస్తున్నాయి. వాతావరణం బాగా లేకపోవడం వల్లనో, సాంకేతిక సమస్యల వల్లనో తరచూ విమానాలు ఆలస్యమవుతున్నాయి. అలాంటి సమయాల్లో ఎవరూ చేసేదేం ఉండదు. అయితే తాజాగా స్పెయిన్ (Spain)లో చాలా విచిత్ర కారణంతో ఓ విమానం ఆగిపోయింది.
బ్రిటన్‌కు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఈజీ జెట్ (EasyJet) గత బుధవారం స్పెయిన్ నుంచి బ్రిటన్ (Britain)కు ప్రయాణించాల్సి ఉంది. బుధవారం రాత్రి 9 గంటల 45 నిమిషాలకు ఆ విమానం స్పెయిన్‌లోని లాంజ్రోట్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కావాలి. అయితే ఆ విమానాశ్రయంలోని చిన్న రన్-వే (Run Way)పై నుంచి భారీ విమానం సురక్షితంగా టేకాఫ్ (Takeoff) కావడం కష్టమని పైలెట్ భావించాడు. దీంతో విమానంలోని బరువు తగ్గించాలని సూచించాడు. విమానంలోని 20 మంది ప్రయాణికులు దిగిపోతే తప్ప టేకాఫ్ కావడం కష్టమని తేల్చి చెప్పాడు. దీంతో ఈజీ జెట్ ప్రయాణికులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది.
Viral Video: రోడ్డు దాటడానికి ఇలాంటి ట్రిక్ ఉపయోగించాలా? వైరల్ అవుతున్న యువకుడి ఫన్నీ వీడియో!
20 మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని, అందుకు ఒప్పుకున్న వారికి 500 యూరోలు నష్టపరిహారం ఇస్తామని ఈజీ జెట్ సంస్థ ప్రకటించింది. అయినప్పటికీ ఏ ఒక్క ప్రయాణికుడూ ముందుకు రాలేదు. చివరికి 19 మంది ప్రయాణికులకు నచ్చజెప్పి వారిని విమానం నుంచి దింపేశారు. చివరకు రెండు గంటల ఆలస్యంగా రాత్రి 11.24 గంటలకు విమానం టేకాఫ్ అయింది. ఆ 19 మంది ప్రయాణికులను ఆ తర్వాత విమానంలో బ్రిటన్ పంపించారు. కొంతమంది ప్రయాణికులు విమానం దిగాలని పైలట్ చెబుతున్న వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Updated Date - 2023-07-10T15:07:54+05:30 IST