Early Dinner: రాత్రిపూట తొందరగా భోజనం చేయడం మంచిదేనా..? డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!
ABN, First Publish Date - 2023-11-22T11:31:58+05:30
రాత్రి 7గంటల లోపు భోజనం ముగిస్తే జరిగేది ఇదేనంటూ వైద్యులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
ఆహారం తీసుకునే వేళలు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని అంటారు. అందుకే వేళకు భోజనం చెయ్యాలని చెబుతారు. కానీ ఏదో ఒక సమయంలో తింటున్నాం కదా ఇంకేంటి? అనుకునేవారు చాలామందే ఉన్నారు. తినే సమయం లేక కొందరు, తినే సమయం ఉన్నా అప్పుడే ఆకలి వేయట్లేదు అనే కారణంతో మరికొందరు ఆహారం తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యంగా రాత్రి భోజనం తొందరగా చెయ్యాలని చెబుతుంటారు. కానీ అధ్యయనాల ప్రకారం పెద్దవాళ్లు దీర్ఘకాలం జీవించడం వెనుక కారణం రాత్రి సమయంలో భోజనం తొందరగా ముగించడమేనట. రాత్రి 7గంటల లోపు భోజనం ముగిస్తే జీవితకాలం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంంటో కూడా చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
రాత్రి సమయంలో తొందరగా భోజనం ముగించడం వల్ల జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనానికి, నిద్రకు మద్య గ్యాప్ ఉండటంతో ఆహారం జీర్ణమై పడుకునే సమయానికి కడుపు సౌకర్యవంతంగా ఉంటుంది. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఇది కూడా చదవండి: ఇంటి ముందు తప్పకుండా పెంచాల్సిన 5 మొక్కలివీ..!
భోజనానికి, నిద్రకు మద్య గ్యాప్ బాగా ఉండటం వల్ల నిద్ర బాగా పడుతుంది. అజీర్తి సమస్య తొలగిపోతుంది.
బరువు తగ్గడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు రాత్రి 7 గంటలలోపు భోజనం చేయడం ప్రారంభిస్తే తొందరగా ఫలితాలు చూస్తారు.
నిద్రపోతే శరీరం విశ్రాంతి స్థితికి వెళుతుంది. అందుకే 7గంటల లోపు భోజనం చేస్తే ఆ ఆహారాన్ని విచ్చిన్నం చేసే శక్తి శరీరానికి ఉంటుంది. పోషకాలు సంగ్రహించడంలో సమస్య ఏర్పడదు. శరీరం ఇన్సులిన్ ను బాగా ఉపయోగించగలుగుతుంది. చక్కెర స్థాయిలు పెరగవు.
ఇది కూడా చదవండి: Hypnosis: బాబోయ్.. ఇదేం ట్విస్టు.. ఏకంగా పోలీసునే హిప్నాటిజం చేసేశాడుగా.. అసలేం చేశాడో చూస్తే అవాక్కవడం ఖాయం..!
Updated Date - 2023-11-22T11:32:02+05:30 IST