Viral: ఓరి దేవుడో.. ఇలాంటి బాస్‌లు కూడా ఉంటారా..? ఆఫీసులో ఓ ఉద్యోగి ఫోన్‌ను ఛార్జింగ్ పెడుతున్నాడని..!
ABN, First Publish Date - 2023-08-17T16:38:27+05:30
నేటి ఉరుకుపరుగుల యాంత్రిక జీవనంలో చాలా మంది వివిధ రకాల మానసిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇటు ఇంట్లో సమస్యలు, అటు ఆఫీసు సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ క్రమంలో కొన్ని ఆఫీసుల్లో కొందరికి విచిత్ర సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు ..
నేటి ఉరుకుపరుగుల యాంత్రిక జీవనంలో చాలా మంది వివిధ రకాల మానసిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇటు ఇంట్లో సమస్యలు, అటు ఆఫీసు సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ క్రమంలో కొన్ని ఆఫీసుల్లో కొందరికి విచిత్ర సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఉద్యోగికి తన ఆఫీసులో విచిత్ర అనుభవం ఎదురైంది. ఆఫీసులో ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టిన ఓ ఉద్యోగి.. బాస్ అన్న మాటలకు షాక్ అయ్యాడు. ఇతడి గురించి తెలుసుకుని నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘ఓరి దేవుడో.. ఇలాంటి బాస్‌లు కూడా ఉంటారా..?’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఆఫీసులో తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. సదరు వ్యక్తి ఆఫీసుకు వెళ్లగానే చార్జింగ్ (Phone charging) లేకపోవడంతో తన ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న తన బాస్ మండిపడ్డాడు. ‘‘ఏంటీ ఆఫీసులో ఛార్జింగ్ పెడుతూ విద్యుత్‌ను చోరీ చేస్తున్నావ్’’.. అంటూ ఫైర్ అయ్యారట. దీంతో సదరు ఉద్యోగి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. బాస్ అన్న మాటలకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాక.. తన సమస్యను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘‘రాత్రి పడుకునే ముందు ఇంట్లో చార్జింగ్ పెట్టడం మర్చిపోయా. అందుకే ఉదయం ఆఫీసుకు రాగానే ఛార్జింగ్ పెట్టుకున్నాను. అలాగని ఆఫీసులో ఎలంటి ఫోన్లూ మాట్లాడను. అయినా నా బాస్ విద్యుత్ చోరీ చేశానని మాట్లాడుతున్నాడు’’.. అంటూ తన మనసులోని బాధను బయటపెట్టాడు.
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఛార్జింగ్ పెడితే విద్యుత్ చోరీ చేస్తున్నారనడం ఏంటీ.. అతడికేమైనా మెంటలా’’.. అని ఓ వ్యక్తి, ‘‘మీ బాస్ ఒక మూర్ఖుడు. అంటే ఆఫీసులో గాలి పీల్చినా, నీరు తాగినా చోరీ చేసినట్లేనా’’.. అని రెండో వ్యక్తి, ‘‘మీ బాస్ మీకు కాల్ చేస్తే.. టాక్‌టైమ్, బ్యాటరీ చార్జింగ్ చోరీ చేస్తున్నారని మీరు కూడా చెప్పండి’’.. అని మూడో వ్యక్తి, ‘‘మీ ఆఫీసులో టాయిలెట్ ఉపయోగించాక నీటిని ఫ్లష్ చేయకండి. ఎందుకంటే అది చోరీ కిందకు వస్తుంది కాబట్టి.. అలాగే వదిలేయండి’’.. అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. దీనిపై చివరగా సదరు ఉద్యోగి మరో వివరణ కూడా ఇచ్చాడు. తన బాస్‌ను త్వరలో విధుల నుంచి తొలగిస్తున్నారని, ఆ కోపంతోనే ఇలా ఉద్యోగులను వేధిస్తున్నాడని తెలిపాడు. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-08-17T16:38:27+05:30 IST